తాగడం, అర్థరాత్రిపూట అలా గడపడం.. ఇవే కాదు ఇంకా.. కాజల్ షాకింగ్ కామెంట్స్

Recommended Video

Kajal Aggarwal Attracts Youth With Her Latest Photo Shoot || Filmibeat Telugu

హీరోయిన్లందరిలో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రూటే సపరేటు. తనకు ఏదనిపిస్తే అది చేయడం, ఏదనిపిస్తే అదే మాట్లాడటం కాజల్ అగర్వాల్ కే సొంతం. నిన్నగాక మొన్న తన ఒరిజినల్ రూపమిదే అని పేర్కొంటూ సంచలనం సృష్టించిన ఈ భామ..ఇప్పుడు ముంబై లోని మెరైన్ డ్రైవ్ లో మస్త మజా ఇచ్చే ఫోజులతో మరింత కిక్కిచ్చే మెసేజ్ పెట్టి ఆశ్చర్య పరిచింది. ఆ వివరాల్లోకి పోతే..

మెరైన్ డ్రైవ్ లో కాజల్ మజా

మెరైన్ డ్రైవ్ లో కాజల్ మజా

సినిమాల పరంగా హాఫ్ సెంచరీ దాటేసిన కాజల్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటోంది. రోజుకో ఫోటో షూట్ పోస్ట్ చేస్తూ కుర్రకారు చూపులు యంగ్ హీరోయిన్స్ వైపు పడకుండా తనవైపే తిప్పుకుంటోంది. ఈ కోవలోనే తాజాగా ముంబై ఫేమస్ స్పాట్ మెరైన్ డ్రైవ్ లో కాజల్ తెగ హంగామా చేస్తూ సెక్సీ ఫోజులిచ్చింది.

మాయ చేస్తున్న సెక్సీ లుక్స్

మాయ చేస్తున్న సెక్సీ లుక్స్

పింక్ కలర్ గౌన్, వైట్ కలర్ షూ ధరించి జడవేసుకోకుండా వదిలేసి లూస్ హెయిర్ దానికి తగ్గట్టుగా స్మాల్ మేకప్ తో అచ్చం బార్బీ డాల్ మాదిరిగా దర్శనమిచ్చింది కాజల్ అగర్వాల్. ముంబైలోని అన్ని లొకేషన్స్‌లోకెల్లా మెరైన్ డ్రైవ్ అందమే వేరు. యూత్ అంతా ఎప్పుడూ అక్కడే తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఆ లొకేషన్ తో కాజల్ కి కూడా మంచి అనుబంధముందట. ఈ మేరకు ఆ అనుబంధాన్ని పేర్కొంటూ మెసేజ్ పెట్టింది కాజల్.

మెరైన్ డ్రైవ్ లో గడిపాను.. తాగడం, అర్థరాత్రిపూట ఐస్ క్రీమ్స్ తినడం..

మెరైన్ డ్రైవ్ లో గడిపాను.. తాగడం, అర్థరాత్రిపూట ఐస్ క్రీమ్స్ తినడం..

"నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చాలాసార్లు ముంబై లోని మెరైన్ డ్రైవ్ లో గడిపాను. సరిగ్గా ఇదే స్థలంలో కూర్చునేదాన్ని నా బెస్ట్ ఫ్రెండ్స్ తో కూర్చొని ఎన్నోసార్లు జాలీగా నవ్వుతూ గడిపిన సందర్భాలున్నాయి. 20-నిముషాల పవర్ వాక్స్, మారథాన్, రన్నింగ్, డ్రైవ్ ఎలా చేయాలో నేర్చుకోవడం, ఋతుపవనాల సమయంలో చిరుజల్లుల్లో ఆమ్ రస్ తాగడం, అర్థరాత్రిపూట ఐస్ క్రీమ్స్ తినడం, ఇవే కాదు.. మనసుకు గాయం తగిలినప్పుడు తనివితీరా ఏడవడం ఇవన్నీ ఇక్కడే చేసేదాన్ని. అందుకే ఈ స్థలం ఇప్పటికీ ఎప్పటికీ నా మనసుకు దగ్గరగానే ఉంటుంది'' అని కాజల్ పేర్కొనడం విశేషం.

 ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే

ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే

ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమాతో భారీ డిసాస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ప్యారిస్ ప్యారిస్ సినిమాలో, కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తోంది కాజల్ అగర్వాల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X