For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ హాట్ ఫోజులతో కాజల్ అగర్వాల్: పెళ్లైన తర్వాత తొలిసారి ఇంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందరూ సక్సెస్ కాలేరు. అయితే, కొందరు మాత్రం ఆరంభంలోనే మంచి గుర్తింపును అందుకుని సత్తా చాటుతుంటారు. అలా స్టార్ హీరోయిన్లుగా ఎదిగిపోతుంటారు. అలాంటి వారిలో టలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ.. ఎవరూ ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపించింది. ఇక, గత ఏడాది గౌతమ్ కిచ్లూను కాజల్ ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో సినిమాల వేగం తగ్గించేసింది. కానీ, సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

  అలా మొదలైన కెరీర్... ఇలా పాపులర్

  అలా మొదలైన కెరీర్... ఇలా పాపులర్

  సినిమాల్లోకి రావడానికి ముందు కాజల్ అగర్వాల్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే పలు యాడ్స్‌లోనూ నటించింది. అలా బిజీగా గడుపుతోన్న సమయంలోనే కల్యాణ్ రామ్ నటించిన ‘లక్ష్మీ కల్యాణం'తో ఈ బ్యూటీ హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో మెప్పించిన ఈ బ్యూటీ.. తెలుగులో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. దీంతో రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటూ సాగిపోయింది.

  Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

   అందరితోనూ ఆడిపాడిన చందమామ

  అందరితోనూ ఆడిపాడిన చందమామ

  హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించిన సమయంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది కాజల్ అగర్వాల్. దీంతో ఆమె పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోయింది. ఫలితంగా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులోని స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుందామె. ఏ సినిమా చేస్తే అది హిట్ అనేలా ఈ అమ్మడు ముందుకు సాగింది. ఫలితంగా అప్పట్లో తన హవాను చూపించింది. స్టార్లతోనే కాకుండా జూనియర్ హీరోల సినిమాల్లోనూ నటించింది. అలాగే, ‘ఖైదీ నెంబర్ 150'లో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవితోనూ రొమాన్స్ చేసిందీ బ్యూటీ.

   తగ్గిన సినిమాలు.. అదే కారణమంటూ

  తగ్గిన సినిమాలు.. అదే కారణమంటూ

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టిన తర్వాత కాజల్ అగర్వాల్ చాలా కాలం పాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. ఇలా దాదాపు ఐదారేళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోనూ నటించింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె సినిమాల వేగం తగ్గించేసింది. అలా అని ఈ బ్యూటీకి అవకాశాలు రావట్లేదని కాదు.. చాన్స్‌లు వచ్చినా సెలెక్టివ్‌గానే సినిమాలను చేస్తోంది. ఫలితంగా తక్కువ చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. దీంతో ఆమె కెరీర్ ముగిసినట్లేనన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

  ‘జానకి కలగనలేదు' హీరో చనిపోయాడంటూ వార్త: అసలు మేటర్ రివీల్ చేస్తూ.. ఆరియానా సంచలన వ్యాఖ్యలు

  గౌతమ్‌తో ప్రేమ.. పెళ్లి చేసుకున్న నటి

  గౌతమ్‌తో ప్రేమ.. పెళ్లి చేసుకున్న నటి

  కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పుడే.. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు రహస్యంగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ క్రమంలోనే గత ఏడాది ఆరంభంలోనే తన ప్రేమను బహిర్గతం చేసుకుంది. ఆ తర్వాత 2020 అక్టోబర్ 30న కరోనా నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో గౌతమ్‌ను వివాహం చేసుకుంది. అయితే, చాలా మందిలా పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా.. తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందామె.

  వివాహం తర్వాత ఇలా... తప్పుకుంది

  వివాహం తర్వాత ఇలా... తప్పుకుంది

  పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు చేయడం లేదు. ఈ ఏడాది ఆరంభంలో ఆమె తెలుగులో ‘మోసగాళ్లు' అనే సినిమా చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇందులో ఆమె మంచు విష్ణుకు సోదరిగా నటించింది. ఇక, ప్రస్తుతం కాజల్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య'లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ప్రవీణ్ సత్తారు రూపొందిస్తోన్న చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన నటిస్తోన్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఈ మూవీ నుంచి కాజల్ తప్పుకుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

  Bigg Boss: అమ్మాయిగా మారింది అతడి వల్లే.. పెళ్లి చేసుకుంటానని చివరికి ఆ పని: ప్రియాంక సీక్రెట్ లీక్

  కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అని టాక్

  కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అని టాక్

  కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందని కొద్ది నెలల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ వాటిని కొట్టివేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ట్విట్టర్‌లో ఓ నెటిజన్ ‘కాజల్, గౌతమ్ ఫ్యామిలీలో సంతోషకరమైన వార్త' అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని కూడా ఆ పోస్టులో జత చేశారు. దీంతో ఆమె నిజంగానే తల్లి కాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. దీనికితోడు నాగ్ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు రావడంతో ఇది నిజమేనని అనుకుంటున్నారు.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

  అప్పట్లో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించకపోయినప్పటికీ.. కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించడంతో పాటు అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. మరీ ముఖ్యంగా అందాల విందు చేస్తూ దిగిన వాటిని కూడా బాగానే షేర్ చేస్తోంది. దీంతో ఆమె హాట్ టాపిక్ అవుతోంది.

  Bigg Boss: బయటపడిన రవి బండారం.. లహరి విషయంలో ప్రియ అన్నది నిజమే.. షాకిస్తోన్న వీడియో

  Bigg Boss Telugu 5 : ఎట్టకేలకు మాస్క్ తీసేసిన Shanmukh.. వెరీ బ్యాడ్ అంటూ ఫైర్..! | Filmibeat Telugu
   ఘాటు ఫోజులతో కాజల్ అగర్వాల్ రచ్చ

  ఘాటు ఫోజులతో కాజల్ అగర్వాల్ రచ్చ

  ఇంటర్నెట్‌లో ఎప్పుడూ హల్‌చల్ చేసే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు హాట్ డ్రెస్ ధరించి స్టైలిష్ లుక్‌తో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ పిక్స్‌లో ఆమె ఎద అందాలు కనిపించేలా ఘాటుగా ఫోజులిచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే వీటికి ఏడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఫలితంగా పెళ్లైన తర్వాత కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ హాట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

  English summary
  Tollywood Star Heroine Kajal Aggarwal Very Activ in Social Media. Recently She Shared Sizzling Photo In her Instgram Account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X