Kajal Aggarwal ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్.. సోషల్ మీడియాలో మరో రచ్చ మొదలైంది?
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 17 ఏళ్లకు దగ్గర కావొస్తోంది. ఇక ఆమె వయసు ఎంత పెరిగినా కూడా అందం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఒక విధంగా గ్లామర్ అంతకంతకూ పెరుగుతూనే ఉందని అభిమానులు పాజిటివ్ గా కామెంట్ చేస్తూ ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు టాప్ పొజిషన్ లో ఉన్న అందరిపైన ఏదో ఒక విధంగా నెగిటివ్ కామెంట్స్ రావడం సహజం.
కానీ ఈ బ్యూటీపై మాత్రం పెద్దగా నెగిటివ్ వార్తలు రావు. దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులు కాజల్ అగర్వాల్ ని లైక్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక స్టోరీ అయితే వైరల్ గా మారింది.

వెనక్కి తిరిగి చూసుకోలేదు
2004 లో ఒక హిందీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మూడేళ్లకు 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటూ ఇండస్ట్రీలో తన స్థాయి అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది.

సరికొత్త రికార్డు
కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అందరి హీరోల ను కవర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా తెలుగులోనే బాక్సాఫీస్ హిట్స్ అందుకుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో రెండు తరాల తో కలిసి నటించడం విశేషం అని చెప్పవచ్చు. తెలుగులో ఏ హీరోయిన్ కూడా ఆ తరహాలో రికార్డు అందుకోలేక పోయారు.

బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి
ఎంతోమంది గ్లామరస్ బ్యూటీలు వస్తుంటారు పోతుంటారు. కానీ కాజల్ మాత్రం తన స్టార్ స్టేటస్ ను అలానే కొనసాగిస్తోంది. సక్సెస్ వచ్చిన డిజాస్టర్స్ వచ్చినా కూడా ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా ఒకే తరహాలో ఉంటుంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో అతనితో స్నేహంగా ఉండే కాజల్ ఫైనల్ గా కుటుంబ సభ్యులను ఒప్పించి గత ఏడాది సైలెంట్ గా వివహం చేసేసుకుంది.

ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్
అయితే హఠాత్తుగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితం చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో కొంతమంది సినీ తారలు ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక కాజల్ అగర్వాల్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఉన్నట్లు చెబుతూ వేచి ఉండాలని కూడా సింపుల్ గా ఒక లైన్ లో పోస్ట్ పెట్టేసింది.

వాటి అర్థం ఏమిటి?
అంతే కాకుండా లవ్ సింబల్ తో పాటు డాన్స్ చేస్తున్న ఏమోజీ ని కూడా జత చేసింది. చూస్తుంటే కాజల్ అగర్వాల్ తన పర్సనల్ లైఫ్ లో ఎదో ముఖ్యమైన విషయాంజి చెప్పాలని అనుకుంటున్నట్లు టాక్ వచ్చింది. లేదా కొత్త ప్రాజెక్టు పై ఆమె అప్డేట్ ఇవ్వనుందా అని ఆమ్స్ ఫాలోవర్స్ ఆలోచిస్తున్నారు. మరి కాజల్ ఎలాంటి వార్త చెబుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











