ఇక టాలీవుడ్‌కు దూరం.. అటువైపే కాజల్ అగర్వాల్ చూపు
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికే పదముడేళ్లవుతోంది. అయినా కూడా కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. చాలా మంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు. కానీ కాజల్ మాత్రం నేను పక్కా లోకల్ అంటూ ఆఫర్స్ అందుకుంటోంది. అలాగే తన గ్లామర్ తో నేటితరం యంగ్ హీరోయిన్స్ కి మంచి పోటీని ఇస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్న ఈ బ్యూటీ బాలీవుడ్ వైపు కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబైసాగా అనే చిత్రంలో అవకాశం అందుకున్న చందమామ త్వరలో మరో రెండు సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మడి సినిమాలు అంతగా సక్సెస్ కాకపోయినప్పటికి ఆఫర్స్ అయితే తగ్గలేదు.

ప్రతి సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటూ వెళుతూనే ఉంది. ఇక ఎక్కువగా తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే కథలనే సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ ని ఒక ట్రాక్ లో సెట్ చేసుకుంది. ఇక బాలీవుడ్ లో కూడా ఇటీవల రెండు కథలను విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతరం ఆ ప్రాజెక్టులపై కాజల్ క్లారిటీ ఇవ్వనుందట. ఇక ప్రస్తుతం తమిళ్ లో కూడా ఈ సీనియర్ బ్యూటీ మూడు సినిమాలు ఫినిష్ చేయడానికి సిద్దమవుతోంది.


Click it and Unblock the Notifications











