కాజల్ అగర్వాల్ ఆ సినిమాలో దెయ్యంగా.. తొలిసారిగా భయపెట్టే సినిమాతో..
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కాజల్ అగర్వాల్ 2020లో తను ప్రేమించిన బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సరికొత్త ఫ్యామిలీ లైఫ్ మొదలుపెట్టింది. ఇక ఆమె పెళ్లి తర్వాత పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ తో హ్యాపీగా గడుపుతున్న చందమామ త్వరలోనే చిత్ర పరిశ్రమలో మళ్లీ ఎప్పటిలానే బిజీగా కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఇదివరకే ఆమె కొన్ని ప్రాజెక్టులు చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా తమిళంలో కమల్ హాసన్ శంకర్ కలయికలో రాబోతున్న బిగ్ బడ్జెట్ మూవీ ఇండియన్ 2 సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకుంది. అలాగే మరో తమిళ సినిమా కూడా చర్చల దశలో ఉంది. ఇక ఈ క్రమంలోనే చంద్రముఖి సీక్వెల్లో కూడా నటించబోతున్నట్లు మరొక కొత్త టాక్ అయితే వినిపిస్తోంది. ఆమె కోసమే ప్రత్యేకంగా పాత్రను దర్శకుడు పీ వాసు డిజైన్ చేసినట్లుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. అలాగే కాజల్ కోసం కొన్నాళ్లపాటు షూటింగ్ కూడా వాయిదా వేసుకున్నారుని తమిళ మీడియాలో వార్తలు జోరుగా వస్తున్నాయి.

ఇక ఆ సంగతి పక్కన పెడితే ఆ సినిమాలో అయితే కాజల్ అగర్వాల్ భయపెట్టే పాత్రలో కనిపించబోతోంది అని ఆమెను కూడా చంద్రముఖి ఆవహిస్తుంది అని మరొక టాక్ కూడా వైరల్ గా మారింది. చంద్రముఖి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న చిత్రం. ఆ తర్వాత ఆ సినిమాకు నాగవల్లి అని కూడా మరొక సినిమాను తీసారు. కానీ అది తెలుగులో అంతగా సక్సెస్ కాలేకపోయింది.
ఇక ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడు పీ వాసు చంద్రముఖి ఒరిజినల్ సీక్వెల్ అంటూ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. ఇక ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా కనిపించబోతున్నాడు. మధ్యలో షూటింగ్ అయితే కొంత ఆగిపోయినట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ కాజల్ అగర్వాల్ అందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నట్లు కొత్త వార్తలు అయితే తమిళ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టి సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని దర్శకుడు పీ.వాసు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











