For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas కోసం కాజల్ సంచలన నిర్ణయం: అందాల విందు చేయడానికి సిద్ధం..!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది కాజల్ అగర్వాల్. కెరీర్ ఆరంభంలోనే అందంతో పాటు యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏకధాటిగా సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. అదే సమయంలో వేరే భాషల్లోనూ హవాను చూపించింది. ఇక, ఇటీవలే వివాహం చేసుకున్న ఈ స్టార్ హీరోయిన్.. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కాజల్ అగర్వాల్.. ప్రభాస్ కోసం సంచలన నిర్ణయం తీసుకుందట. ఆ సంగతులు మీ అందరి కోసం!

  పొట్టిగౌనులో అనసూయ హాట్ ఫోటో షూట్.. అదిరే అందాలతో హొయలు పోతూ!

  అందరి ఫస్ట్ చాయిస్ కాజల్ అగర్వాల్

  అందరి ఫస్ట్ చాయిస్ కాజల్ అగర్వాల్

  కాజల్ అగర్వాల్ చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేలా ఈ బ్యూటీ హవాను చూపించింది. అంతేకాదు, భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాల్లోనూ నటిస్తూ దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గానూ రికార్డులకెక్కింది. దీంతో ఈమె పేరు మారుమ్రోగిపోయింది.

  ప్రియుడితో వివాహం.. గ్యాప్ లేకుండా

  ప్రియుడితో వివాహం.. గ్యాప్ లేకుండా

  ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే కాజల్ అగర్వాల్.. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు రహస్యంగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుంది. అయితే, చాలా మందిలా పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకోకుండా సినిమాలకు సై అనేసిందామె.

  ఒక డిజాస్టర్.. ఇద్దరు సీనియర్లకు జోడీ

  ఒక డిజాస్టర్.. ఇద్దరు సీనియర్లకు జోడీ

  గౌతమ్‌తో పెళ్లి తర్వాత కాజల్ తెలుగులో ‘మోసగాళ్లు' అనే సినిమా చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇందులో ఆమె మంచు విష్ణుకు సోదరిగా నటించింది. అలాగే, ఇప్పుడామె మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య'లో హీరోయిన్‌గా చేస్తోంది. దీనితో పాటు అక్కినేని నాగార్జున - ప్రవీణ్ సత్తారు మూవీలోనూ హీరోయిన్‌గా నటించడానికి సిగ్నల్ ఇచ్చేసింది.

  ప్రభాస్ సినిమాలో భాగం కాబోతుందట

  ప్రభాస్ సినిమాలో భాగం కాబోతుందట

  పెళ్లి తర్వాత కాజల్ కెరీర్ మసకబారుతుందని అంతా అనుకున్నారు. దీనికితోడు ఆమెకు యంగ్ హీరోల సరసన అవకాశాలు దక్కడం లేదని, ఫేడౌట్ అయిపోయిందని టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా ఆమె వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్'లో భాగమైందని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

   ప్రభాస్ కోసం కాజల్ సంచలన నిర్ణయం

  ప్రభాస్ కోసం కాజల్ సంచలన నిర్ణయం

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సలార్'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేసేసిందని ఫిలిం నగర్ టాక్. ఇక, ఇందులో ఒప్పుకోడానికి ప్రభాస్‌తో ఉన్న స్నేహమే కారణమని తెలుస్తోంది. అతడి కోరిక మేరకే ఈ సాంగ్ చేస్తుందట.

  BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
  అప్పుడలా చెప్పి.. ఇప్పుడిలా చేస్తోంది

  అప్పుడలా చెప్పి.. ఇప్పుడిలా చేస్తోంది

  సుదీర్ఘమైన కెరీర్‌లో కాజల్ అగర్వాల్ ‘జనతా గ్యారేజ్' సినిమాలో మాత్రమే ‘పక్కా లోకల్ పక్కా లోకల్' అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సమయంలో ఎన్టీఆర్ కోసమే దీనికి ఒప్పుకున్నానని.. ఫ్యూచర్‌లో అలాంటివి చేయనని ఆమె చెప్పుకొచ్చింది. కానీ, ఇప్పుడు మరోసారి ఆమె ఇలాంటి సాంగ్ చేయబోతుందని ప్రచారం జోరందుకుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  English summary
  Tollywood Star Heroine Kajal Aggarwal Now Doing a Film with Akkineni Nagarjuna Under Praveen Sattaru Direction. Now She Say OK To Special Song in Prabhas's Salaar Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X