బెల్లంకొండ వారి పెళ్లిలో కాజల్ మెస్మరైజ్.. అలాంటి డ్రెస్‌లో స్సెషల్ అట్రాక్షన్‌గా!

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్- కావ్య రెడ్డిల వివాహం ఏప్రిల్ 29న తిరుపతిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌లో మే 1వ తేదీన సినీ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ రిసెప్షన్‌ కోసం సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డితో గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. తొలుత ప్రేక్షకులకు తన ప్రేయసిని పరిచయం చేసిన ఆయన.. ఏప్రిల్ 8వ తేదీన కావ్యరెడ్డితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. అనంతరం ఏప్రిల్ 29న తన పెళ్లి తిరుమల శ్రీవారి సన్నిధిలో జరుగుతుందని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. అలాగే మే 1వ తేదీన హైదరాబాద్‌లో తమ పెళ్లికి రావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇతర సినీ, రాజకీయ ప్రముఖులను కుటుంబంతో కలిసి వెళ్లి ఆహ్వానించారు.

Kajal Aggarwal Steals the Spotlight at Bellamkonda Sai Sreenivas - Kavya Reddy Wedding Reception in Hyderabad

హైదరాబాద్‌లో జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్యరెడ్డిల వెడ్డింగ్ రిసెప్షన్‌కు అతిరథ మహారథులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, శ్రీకాంత్, యాంకర్ సుమ దంపతులు, నాగచైతన్య, తరుణ్‌, వీవీ వినాయక్, బోయపాటి శ్రీను, దిల్‌రాజు, గోపీచంద్‌లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. అగ్రనటి కాజల్.. తన భర్త గౌతమ్‌తో కలిసి ముంబై నుంచి వచ్చి.. శ్రీనివాస్- కావ్యలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వేడుకలో కాజల్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

వైట్ కాలర్ హాఫ్ శారీ మోడల్‌లో ఉన్న చీరలో అందాల విందు చేశారు. గ్రాండ్ డిజైన్, షైనింగ్ ఎంబ్రాయిడరీ ఉన్న లెహంగా శారీలో తళుక్కున మెరిశారు కాజల్. వేదికపై శ్రీనివాస్ సతీమణి కావ్యతో ముచ్చటించి సందడి చేశారు కాజల్. శ్రీనివాస్‌- కాజల్‌లు కలిసి ఇప్పటికే సీత, కవచం వంటి సినిమాలలో జంటగా నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ మొదలైంది. ఆ అనుబంధంతోనే ముంబై నుంచి శ్రీనివాస్ రిసెప్షన్‌కు భర్తతో కలిసొచ్చారు కాజల్.

అయితే 40 ప్లస్‌లోనూ చెక్కుచెదరని అందాలతో మెరిసిపోతున్నారు. కుర్ర హీరోయిన్లను మించి అందాలు, ఫిగర్ మెయింటైన్ చేస్తున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు.. భర్త, కొడుకుతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాజల్. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కాజల్.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకు సెగలు రేపుతుంటారు కాజల్. ప్రస్తుతం హిందీలో రామాయణ సినిమాలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్ అందుకున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు జోడీగా నటించే ఛాన్స్ కొట్టేసినట్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి కాంబోలో గతంలో భగవంత్ కేసరి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కాజల్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X