Kajal Aggarwal: కాకరేపుతున్న కాజల్ గ్లామర్.. అమ్మగా మారినా ఆగట్లేదుగా!
Kajal Aggarwal: లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన కాజల్ అగర్వాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిందీ ముద్దుగుమ్మ. తెలుగులో పెద్ద పెద్ద హీరోల అందరి సరసన నటించి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది. ముఖ్యంగా చందమామ, మగధీర, గణేష్, ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, దడ, బిజినేస్ మేన్, సారొచ్చారు, నాయక్, బాద్ షా, ఎవడు, టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, కవచం.. వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
2020లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2022 ఏప్రిల్ 19వ తేదీన ఓ బాబు కూడా పుట్టాడు. ఇక ఆ తర్వాత కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అమ్మతనాన్ని బాగా ఆస్వాదించింది. ఇక ఈమధ్యే సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసేసింది. తల్లిగా మారినా కాజల్ అందాలు ఏమాత్రం తగ్గలేదు. గతంలో కంటే కూడా మరింత క్యూట్ అండ్ హాట్ గా తయారైందీ ముద్దుగుమ్మ. ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది.

ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన సినీ అప్ డేట్లతో పాటు, పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను నెట్టింట పెడుతూ... కుర్రకారులో హీటు పుట్టిస్తోంది. అమ్మగా మారిన అందాల ఆరబోతలో మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. అందాలన్నీ కనిపించేలా డ్రెస్సులు వేసుకొని ఫొటోలు దిగడం వాటిని నెట్టింట షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇవ్వడం పరిపాటిగా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే లుక్కులో కనిపించింది.

లైట్ గ్రీన్ డ్రెస్సు వేసుకొని కాజల్ అగర్వాల్ చాలా స్షైలిష్ గా కనిపించింది. అదిరిపోయే పోజులు ఇస్తూ.. అందాలు ఆరబోసింది. ఒండినిండా ఉన్న ఈ పద్ధతైన బట్టల్లో కాజల్ చాలా ముద్దుగా కనిపిస్తోంది. బట్టలు ఒంటినిండా ఉన్నప్పటికీ.. బాడీ స్ట్రక్చర్ మాత్రం చాలా బాగా కనిపిస్తోంది. కింద నుంచి పైవరకు కనిపించేలా దిగిన ఈ ఫొటోల్లో ఎద అందాలు హైలెట్ అయ్యాయి. కాజల్ ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఫుల్ వైరల్ గా మారాయి. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు చేస్తూ.. అభిమానులు రచ్చే చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేసి కాజల్ అందచందాలను ఆస్వాదించండి.

తాజాగా కాజల్ అగర్వాల్ నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ యాక్టింగ్ ఇరగదీసిందని టాక్ నడుస్తోంది. బాలయ్య బాబు ప్రేయసిగా చందమామ చాలా గ్లామరస్ గా కనిపించబోతుందట. మరి సినిమాల విడుదల అయ్యాక చూడాలి. కాజల్ అగర్వాల్ ఎలాంటి పాత్రలో కనిపించిందనేది.


Click it and Unblock the Notifications











