పబ్లిసిటీ కోసం అంటూ బురద చల్లుతారా.. ఘాటుగా కాజల్ ట్వీట్!
మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. బాలీవుడ్ లో నేటీమణులు ఎదుర్కొన్న లైంగిక వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హీరోయిన్లు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాల్ని బయట పెడుతుండడంతో మీటూ ఉద్యమానికి అంతకంతకూ మద్దత్తు పెరుగుతోంది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు కూడా మీటూకు మద్దత్తు ప్రకటిస్తునారు. ఆ జాబితాలోకి చందమామ కాజల్ అగర్వాల్ కూడా చేరింది. మీటూ ఉద్యమాన్ని విమర్శిస్తున్న వారిపై ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

ఎంతో ధైర్యం కావాలి
మహిళలుగా ఉండి లైంగిక వేధింపులని బయట పెట్టాలంటే ఎంతో ధైర్యం కావాలి. లైంగిక వేధింపులు ఎదుర్కొని మనసులో భాదని, ఆ సంగతులని బయటకు చెప్పుకుంటున్న వారందరికీ తాను మద్దత్తు ఇస్తానని కాజల్ ట్విట్టర్ వేదికగా స్పందించింది.
దారుణాలు
ఇప్పటివరకు చాలా మంది నటీమణులు తమకు ఎదురైన వేధింపులని బయట పెట్టారు. ఆ దారుణాలని నేను ఊహించుకోలేకున్నా. ఇలాంటి సమయంలో మనం ఒకరికి ఒకరం సహకరించుకోవాలి. కష్టసమయంలో అందరం ఒక్కటిగా మారాలి అని కాజల్ తెలిపింది.
బురద చల్లే ప్రయత్నం
కొంతమంది మీటూ ఉద్యమాన్ని దారుణంగా విమర్శిస్తున్నారు. పబ్లిసిటీ కోసమే హీరోయిన్లు తమపై వేధింపులు జరిగాయని చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్న వారికి ఇదే నా సమాధానం. వారి వేదనని తక్కువ చేసి చూస్తూ బురద చల్లే ప్రయత్నం చేయవద్దు అని కాజల్ ట్వీట్ చేసింది.

పెద్దఎత్తున మద్దత్తు
మీటూ ఉద్యమానికి అన్ని చిత్ర పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున మద్దత్తు లభిస్తోంది. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనె, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, రవీనా టాండన్, సమంత వంటి నటులంతా మీటూ ఉద్యమానికి మద్దత్తు తెలిపారు. ఆ జాబితాలోకి తాజగా కాజల్ అగర్వాల్ కూడా చేరింది.


Click it and Unblock the Notifications











