స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన కాజల్: ప్రెగ్నెంట్ అయినా అందాలు ఆరబోస్తూ ఘాటుగా!
తెలుగు వెండితెరపై ఎంతో మంది హీరోయిన్లు సందడి చేశారు.. చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమ ప్రత్యేకతను చాటుకుని స్టార్లుగా వెలుగొందుతున్నారు. తద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు కాజల్ అగర్వాల్. అందానికి అందం.. నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ భామ.. ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటోంది. దీనికి కారణం ఆమె గర్భవతి కావడమే. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయినా స్విమ్‌సూట్‌తో కనిపించి షాకిచ్చింది. ఇంకెందుకు లేట్? ఆ పిక్‌ను మీరూ చూడండి!

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే కాజల్ అగర్వాల్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అదరగొడుతోన్న సమయంలోనే 'లక్ష్మీ కల్యాణం'తో హీరోయిన్‌గా మారింది. అలా మొదట్లోనే తన నటనతో మెప్పించిన ఈమె.. తర్వాత వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ఫలితంగా ఎన్నో హిట్ చిత్రాల్లో భాగం అయింది. తద్వారా ఫుల్‌గా పాపులారిటీని అందుకుంది.

అక్కడా... ఇక్కడా... అందరితో
చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అందుకున్న కాజల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తీరిక లేకుండా సినిమాలు చేసింది. ఇందులో భాగంగానే ఎంతో మంది స్టార్ హీరోలతో ఆడిపాడింది. అలాగే, కొందరు జూనియర్లతోనూ నటించింది. అంతేకాదు, తెలుగులోనే కాదు.. పలు భాషల్లోనూ సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది.

పెళ్లి తర్వాత స్పీడ్ తగ్గిందిగా
వరుసగా సినిమాలు చేస్తూ చాలా కాలం పాటు టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ స్టార్‌డమ్‌ను చూపించింది. ఇలా దాదాపు దశాబ్ద కాలం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా కనిపించింది. అయితే, తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను కాజల్ అగర్వాల్ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాల వేగం పూర్తిగా తగ్గించేసింది. దీంతో ఆమె అభిమానులు ఎంతో నిరాశగా ఉన్నారనే చెప్పాలి.

ప్రెగ్నెన్సీ... వాటి నుంచి ఔట్
గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు చిత్రాల్లోనూ నటించింది. కానీ, ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున 'ఘోస్ట్', తమిళ చిత్రం 'రౌడీ బేబీ' నుంచి కూడా బయటకు వచ్చేసింది. వీటితో పాటు మరిన్ని చిత్రాలనూ చేయకూడదని డిసైడ్ అయింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగా
గతంలో పోలిస్తే ఇప్పుడు కాజల్ అగర్వాల్ సినిమాలు చేయడం లేదు. కానీ, తన అభిమానులను ఏమత్రం నిరాశ పరచుకుండా ఆమె సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించడంతో పాటు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

ఇప్పటికీ గ్లామర్ ట్రీట్ ఇస్తూ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోన్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగిన వాటిని కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లి తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఈ అమ్మడు అందాలు ఆరబోస్తోంది.

స్విమ్‌సూట్ ఫొటోను వదిలి
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్విమ్‌సూట్ ధరించింది. దానిపైన ట్రాన్స్‌పరెంట్ షర్ట్ వేసుకుంది. అలాగే, స్విమ్మింగ్ పూల్‌లోనూ సందడి చేస్తోంది. ఫలితంగా కాజల్ అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది.


Click it and Unblock the Notifications











