For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ సినిమాలో బోల్డు పాత్రలో కాజల్ అగర్వాల్: రష్మీ గౌతమ్ తర్వాత ఆ రేంజ్‌లో రచ్చ

  |

  టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. చాలా ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన హవాను చూపిస్తూనే ఉంది. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె.. లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇక, గత ఏడాది వివాహం చేసుకున్న ఈ స్టార్ హీరోయిన్.. కెరీర్‌ను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ ఓ బోల్డు పాత్రను చేయడానికి సిద్ధం అయినట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

  అలా ఎంటరైన కాజల్.. స్టార్ హీరోయిన్‌గా

  అలా ఎంటరైన కాజల్.. స్టార్ హీరోయిన్‌గా

  మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే ‘లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా పరిచయమైంది. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో మెప్పించిన ఈ బ్యూటీ.. తెలుగులో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. దీంతో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ రెమ్యూనరేషన్ భారీగా తీసుకుంది.

  ప్రేమ వివాహం... సినిమాలకు బ్రేక్ లేదు

  ప్రేమ వివాహం... సినిమాలకు బ్రేక్ లేదు

  సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే కాజల్ అగర్వాల్.. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు రహస్యంగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుంది. అయితే, చాలా మందిలా పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా.. తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

  డిజాస్టర్‌తో స్టార్ట్... చిరంజీవితో రెండోసారి

  డిజాస్టర్‌తో స్టార్ట్... చిరంజీవితో రెండోసారి

  వివాహం తర్వాత కాజల్ తెలుగులో ‘మోసగాళ్లు' అనే సినిమా చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇందులో ఆమె మంచు విష్ణుకు సోదరిగా నటించింది. అలాగే, ఇప్పుడామె మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య'లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూట్‌ను కూడా పూర్తి చేసింది. గతంలో చిరుతో ‘ఖైదీ నెంబర్ 150'లో చేసింది.

  మరో సీనియర్ హీరోతో సినిమాకు సిద్ధం

  మరో సీనియర్ హీరోతో సినిమాకు సిద్ధం

  ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలతో సైతం నటించేందుకు కాజల్ అగర్వాల్ ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో ఓ మూవీలో నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

  యాక్షన్ మూవీలో ఊహించని విధంగా

  యాక్షన్ మూవీలో ఊహించని విధంగా

  యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. కాజల్ అగర్వాల్ కూడా అదే పాత్రను చేస్తుందట. నాగ్ టీమ్‌లో పని చేసే సహా ఉద్యోగిగా ఆమె కనిపించబోతుందని అంటున్నారు. ఈ మూవీ కోసం కాజల్ ఎన్నో రిస్కీ షాట్స్ కూడా చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది.

  BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
  రష్మీ గౌతమ్ తర్వాత ఆ రేంజ్‌లో రచ్చ

  రష్మీ గౌతమ్ తర్వాత ఆ రేంజ్‌లో రచ్చ

  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ప్రత్యర్థుల ఎత్తుల గురించి తెలుసుకునేందుకు వేశ్యగా మారి వాళ్ల డెన్‌లోకి ప్రవేశిస్తుందట. ఈ పాత్ర ఎంతో బోల్డుగా ఉంటుందని తెలుస్తోంది. గతంలో చూడని విధంగా కాజల్ ఇందులో కనిపిస్తుందని సమాచారం. గతంలో ‘గుంటూరు టాకీస్' మూవీలో రష్మీ గౌతమ్‌ను ఇలాగే చూపించాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.

  English summary
  Tollywood Star Heroine Kajal Aggarwal Now Doing a Film with Akkineni Nagarjuna Under Praveen Sattaru Direction. She will Play Bole Role In This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X