Kajal Aggarwal ద్విపాత్రాభినయంతో ఘోస్టీ.. ఆత్మల కథతో థ్రిల్లింగ్‌గా!
అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అగ్రతారగా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సెకండ్ ఇన్సింగ్స్‌లో కూడా దూసుకుపోతున్నది. పలు భారీ చిత్రాల్లో నటిస్తున్న ఈ అందాల భామ మరో మంచి చిత్రం ఘోస్టీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి సిద్దమైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఉగాది కానుకగా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...

నిర్మాత, గంగ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత మాట్లాడుతూ.. కాజల్ డబుల్ రోల్‌లో విభిన్నమైన పాత్రలో కనిపిస్తుంది. పోలీస్‌గా, అలాగే సినీ తారగా కీలకపాత్రలో నటిస్తున్నారు. రెండు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఆత్మలకు కాజల్ పోషించే పాత్రల మధ్య సంబంధం ఏమిటనే అంశం ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా కొత్త అనుభూతిని అందిస్తుంది అని అన్నారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుందన్నారు. త్వరలో ఘోస్టీ సినిమా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని చెప్పారు.
ఘోస్టీ కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో షార్ట్ ఫిల్మ్ తీయాలనుకునే ఔత్సాహిక దర్శకుడి పాత్రలో యోగిబాబు కనిపిస్తారు. మణిరత్నం అసిస్టెంట్‌గా కాజల్ అగర్వాల్‌ను పరిచయం చేసుకుంటాడు. హీరోయిన్ దగ్గరకు వెళ్ళబోయి పోలీస్ దగ్గరకు వెళతారు. యోగిబాబు మాత్రమే కాదు, చాలా మంది ఆ విధంగా తికమక పడుతారు. హీరోయిన్ అనుకుని దగ్గరకు వచ్చిన వాళ్ళతో నేను పోలీస్ అని చెబుతూ కాజల్ ఒక్కటి పీకడం వంటి సన్నివేశాలు ఉంటాయి. ఇందులో కేఎస్ రవికుమార్ గన్స్ డీల్ చేసే మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ కథలోకి ఆత్మలు ఎలా వచ్చాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
నటీనటులు: కాజల్ అగర్వాల్, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, కేఎస్ రవికుమార్, రిడిన్ కింగ్ స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, ఆడు కాలం నరేన్, మనోబాల, రాజేంద్రన్, సంతాన భారతి, దేవదర్శిని తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











