ఫస్ట్ టైమ్ అది చేశాను.. సంబరపడుతున్న కాజల్
ప్రపంచమంతా కరోనా వైరస్‌కు వణికిపోతోంది. ఈ వైరస్‌కు విరుగుడు ఇంకా కనిపెట్టలేకపోవడం, శరవేగంగా విస్తరిస్తుండటంతో మానవాళి బిక్కుబిక్కుమంటోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యమే చిన్నాభిన్నామైపోతోంది. అమెరికాలోనూ లక్షల మందికి కరోనా సోకగా.. వేల మంది ప్రాణాలను కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఆరు వేలకు పైగా కరోనా కేసులు నిర్ణారణ అయ్యాయి.
కరోనాను కట్టడి చేసేందుకు 21 రోజుల పాటు లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్‌లోనూ రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది. అయితే కరోనా తాకిడి తట్టుకోలేక ప్రజలెవరూ బయటకు రావొద్దని, ఇంటికి పరిమితం కావాలని ప్రభుత్వాలు పదే పదే సూచిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు.
View this post on InstagramA post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

లాక్ డౌన్‌లో భాగంగా ఇంట్లోనే ఉన్న కాజల్ వంటింటి రాజ్యాన్ని ఏలేస్తోంది. ఈ మేరకు మొట్టమొదటి సారిగా ఓ స్పెషల్ డిష్‌ను నేర్చుకున్నట్టు తెలిపింది. పంజాబీ స్పెషల్ సమోసాను ఫస్ట్ టైమ్ ట్రై చేసిందంటా. వాటిని సరైన ఆకారంలో చేసేందుకు చాలానే కష్టపడ్టట్టు.. అమ్మ సాయంతో సమోసాలు చేశానని తెగ సంబరపడిపోయింది. ఈ మేరకు సమెసాలను పట్టుకుని నోరూరించేలా పోజులిస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కాజల్.


Click it and Unblock the Notifications











