ఎప్పుడూ అదే పని.. మళ్లీ నా బాల్యంలోకి.. కాజల్ పోస్ట్ వైరల్
ఓ రెండు మూడు దశాబ్దాలు వెనక్కి వెళ్లే.. ఇప్పుడున్నన్ని వసతులు సౌకర్యాలు ఏవీ ఉండవు. ఊరు మొత్తంలో మహా అంటే ఓ టీవీ ఉంటుంది.. ఊరి జనమంతా అక్కడే పోగవ్వడం జరిగేది. ఇప్పుడున్నన్ని ఎంటర్టైన్మెంట్ చానెల్స్ అప్పట్లో ఉండేవి కాదు. ఉండేది ఒకే ఒక చానెల్. అది కూడా ప్రభుత్వ ఆధీనంలో నడిచే దూరదర్శన్. ఇక అందులో వచ్చిన కార్యక్రమాలంటే ఇప్పటికీ అందరికీ ప్రీతి. దూరదర్శన్‌లో అద్భుత దృశ్యకావ్యమైన రామాయణం సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేస్తున్నారు.

అంతా స్వీయ నిర్భందంలోనే..
కరోనా బీభత్సానికి ప్రపంచమే అతలాకుతలమైపోతోంది. మన దేశంలోనూ కరోనా తాండవం చేస్తున్న ఈ సమయంలో 21 రోజులు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో రామాయణం ధారావాహికను ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ప్రకటన..
ఆ పాత రోజులను గుర్తు చేసేలా రామాయణం సీరియల్ టెలివిజన్ ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. పబ్లిక్ డిమాండ్ మేరకు రామాయణాన్ని మళ్లీ ప్రసారం చేస్తున్నామని తెలిపారు. రామాయణం టెలివిజన్ విజన్ సీరియల్‌ను 21 రోజుల లాక్‌డౌన్ పిరియడ్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. మార్చి 24వ తేదీన ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందేనని అన్నారు.
ఎప్పుడూ అదే పని..
ఈ మేరకు కాజల్ అగర్వాల్ ట్వీట్ చేస్తూ.. నన్ను మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్లింది.. దూరదర్శన్‌లో మళ్లీ రామాయణం, మహాభారతం వస్తున్నాయి. అప్పట్లో ప్రతీ వారాంతం మాకు అదే పని.. మా ఫ్యామిలీ అంతా కలిసి చూసేవాళ్లం.. మళ్లీ తిరిగి ప్రారంభం అయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.. మన విలువలు, సంప్రదాయాన్ని నేర్పడానికి ఇది మంచి దారి అంటూ పేర్కొంది.
Recommended Video

ఆచార్యలో ఫిక్స్..
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తోంది. మొదటగా ఈ పాత్రలో త్రిషను తీసుకోగా.. కొన్ని కారణాలతో ఆమె తప్పుకుంది. దీంతో ఈ అవకాశం కాజల్‌కు దక్కింది. ఈ మూవీ కోసం కాజల్ కూడా భారీగానే డిమాండ్ చేసిందని, రూ.1.5కోట్ల తీసుకుంటుందని టాక్.


Click it and Unblock the Notifications











