హీరో లేకుండా కాజల్ అగర్వాల్ సరికొత్త మూవీ.. ఆ యువ దర్శకుడితో కలిసి..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న అతికొద్ది మంది సీనియర్ హీరోయిన్స్ లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా తన అందంతోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కూడా కాజల్ తన స్టార్ హోదాను ఏ మాత్రం తగ్గించుకోలేదు. అవసరమైన సమయంలో సీనియర్ హీరోలకు ఆమెనే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.

పెళ్లి అనంతరం కూడా కాజల్ ఎప్పటిలానే గ్లామరస్ ఫొటో షూట్స్ తో ఫాలోవర్స్ కు కనుల విందును అందిస్తోంది. ఇక చాలా కాలం తరువాత కాజల్ అగర్వాల్ హీరో లేకుండా ఒక లేడి ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టుకు సమాచారం. పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా కాస్త సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

Kajal aggarwal upcoming lady oriented movie with talented director

ఇక లాక్ డౌన్ అనంతరం జూన్ 19న కాజల్ పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ చేతిలో 5 తమిళ్ సినిమాలు ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్ లో సైతం మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి కాజల్ పెళ్లి తరువాత కూడా బిజీబిజీగా ఛాన్సులు అందుకుంటూ నేటితరం హీరోయిన్స్ కు కూడా పోటీగా నిలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X