Kajal Aggarwalకు 'ఆహా' ఆఫర్.. తమన్నా కంటే ఎక్కువ రెమ్యునరేషన్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా వరకు ఎలాంటి భేదం లేకుండా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీలైనంత వరకు మంచి కంటెంట్ ఉన్న కథలు వస్తే కొన్నిసార్లు రెమ్యునరేషన్ ఎంత తక్కువ ఇచ్చినా కూడా పట్టించుకోరు. ఇక ఈ మధ్య హాట్ బ్యూటీస్ వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తమన్నా తరువాత కాజల్ అగర్వాల్ కూడా ఓకే చెప్పడంతో 'ఆహా' అంతకుమించి అనేలా రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.

ఏ మాత్రం భేదం చూపకుండా

ఏ మాత్రం భేదం చూపకుండా

ఓటీటీ వెబ్ కంటెంట్ కు ఈ మధ్య కాలంలో ఆదరణ అమితంగా పెరుగుతోంది. డిజిటల్ వరల్డ్ లో కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని సినీ తారలు ఏ మాత్రం భేదం చూపకుండా నటిస్తున్నారు. ఇటీవల తమన్నా ఆహా యాప్ లో లేవంత్ హావర్ అనే ఒక వెబ్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే.

 సాలీడ్ రెమ్యునరేషన్

సాలీడ్ రెమ్యునరేషన్

మొదట్లో సినిమాలతో బిజీగా ఉండడం వలన వెబ్ కంటెంట్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపని తమన్నా ఆ తరువాత అల్లు అరవింద్ ప్రత్యేకంగా అడగడంతో వెంటనే ఒప్పేసుకుంది. అందుకు ఆమెకు రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది. కానీ ఆ వెబ్ కంటెంట్ అంతగా క్లిక్కవ్వలేదు.

డిజాస్టర్ వెబ్ సిరీస్..

డిజాస్టర్ వెబ్ సిరీస్..

ఇక కాజల్ అగర్వాల్ కు కూడా అల్లు అరవింద్ ఒక ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇదివరకే కాజల్ అగర్వాల్ హాట్ స్టార్ లో ఒక హారర్ వెబ్ సిరీస్ లో నటించింది. లైవ్ టెలికాస్ట్ అనే ఆ సిరీస్ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ తరువాత చందమామ వెబ్ సిరీస్ లపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ ఆహా కోసం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

కాజల్ కు 'ఆహా' రెమ్యునరేషన్

కాజల్ కు 'ఆహా' రెమ్యునరేషన్

ఆహా యాప్ లో త్వరలోనే పవర్ఫుల్ వెబ్ సిరీస్ లు రాబోతున్నట్లు సమాచారం. ఇక మారుతి రాసిన ఒక ప్రత్యేకమైన స్క్రిప్ట్ అల్లు అరవింద్ కు బాగా నచ్చిందట. కాజల్ అయితే కరెక్ట్ గా సెట్టవుతుందని ఒప్పించారట. రెండు కోట్లకు పైగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఆ వెబ్ కంటెంట్ చందమామకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X