ప్రియుడితో కాజల్ అగర్వాల్ పెళ్లి.. సంగీత్ కోసం సర్వం సిద్ధం.. వివాహం ఎక్కడంటే..

కాజల్ అగర్వాల్ పెళ్లికి ముహుర్తం సమీపించింది. వివాహ వేడుకలో భాగంగా మెహందీ, హల్దీ సెలబ్రేషన్ పూర్తి చేసుకొన్న కాజల్ పెళ్లి వేదికకు శుక్రవారం ఉదయమే కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరి వెళ్లింది. తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను అక్టోబర్ 30 తేదీ సాయంత్రం పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇంట్లో సంప్రదాయంగా జరిగిన కార్యక్రమాల అనంతరం ప్రముఖ హోటల్‌లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకొన్నారు. కాజల్ పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అందంగా ముస్తాబైన కాజల్

అందంగా ముస్తాబైన కాజల్

గురువారం మెహందీ, హల్దీ వేడుకలను కాజల్ కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ వేడుకల కోసం కాజల్ అందంగా ముస్తాబయ్యారు. ఇక పెళ్లి ముహుర్త సమయం దగ్గరపడటంతో ముంబైలోని హోటల్ తాజ్ కొలాబాకు తన తల్లి సుమన్ అగర్వాల్‌తో కలిసి బయలుదేరారు.

మీడియాకు ఓపికగా ఫోజిస్తూ..

మీడియాకు ఓపికగా ఫోజిస్తూ..

ముంబైలోని తన ఇంటి నుంచి హెటల్ తాజ్ కొలాబాకు వెళ్లే సమయంలో మీడియా ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు నవ్వుతూ చేతులు ఊపుతూ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. లాక్‌డౌన్ నిబంధనల కారణంగా దూరంగా ఓపికగా అందర్ని పలకరించి పెళ్లి వేదికవైపు సాగిపోయారు. తన పెళ్లి కోసం డిజైన్ చేసిన దుస్తులను సహాయకులు తీసుకెళ్తూ కనిపించారు.

డిజైనర్ దస్తులు, ఫ్లోరల్ ఆర్నమెంట్స్‌తో

డిజైనర్ దస్తులు, ఫ్లోరల్ ఆర్నమెంట్స్‌తో

ఇక కాజల్ పింక్ కలర్ చూడీదార్ డ్రస్‌ను ధరించి పెళ్లి మంటపానికి బయలు దేరారు. ఫ్లోరల్ అర్నమెంట్స్‌తో అందంగా అలకరించుకొని కనిపించారు. చెరగని నవ్వుతో ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడింది. తల్లితో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ సాయంత్రం పెళ్లికి ముందు సంగీత్ కార్యక్రమం జరుగనున్నది.

Recommended Video

Kajal Aggarwal's Fiency Gautam Kitchlu's Net Worth Details
 కాజల్ వివాహం 30న సాయంత్రం

కాజల్ వివాహం 30న సాయంత్రం

ఇక గౌతమ్ కిచ్లూతో శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత కాజల్ వివాహం జరుగుతున్నది. ఇప్పటికే ఇరు కుటుంబాలు వేదిక వద్దకు చేరుకొన్నారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సమాచారం. ఇక పెళ్లి అనంతంరం దక్షిణాది సినీ ప్రముఖుల కోసం విందును కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X