జోరుగా కాజల్ పెళ్లి వేడుకలు.. కాబోయే భర్తతో స్టెప్పులు.. టాలీవుడ్ నుంచి ఎవరు హాజరవుతున్నారంటే..
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి వేడుకలు ఊపందుకొన్నాయి. కొద్ది గంటల్లో ఆమె వివాహం జరుగబోతున్న సమయంలో కాజల్ అగర్వాల్ ఎమోషనల్‌గా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో స్పందించారు. పెళ్లికి ముందు సంప్రదాయబద్ధంగా నిర్వహించే హల్దీ వేడుక గురువారం అతి నిరాడంబరంగా జోష్‌తో సాగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు మీ కోసం..

హల్దీ వేడుకలో అందంగా ముస్తాబు
పెళ్లికి ముందు నిర్వహించిన హల్దీ వేడుకకు ముందు జరిగిన కార్యక్రమం కోసం పసుపు పచ్చ సల్వార్ కమీజ్ దుస్తులతో అందంగా తయారైంది. కళ్లకు గాగూల్స్ పెట్టుకొని ప్రియుడితో కలిసి స్టెప్పులు వేసింది. ఈ వేడుకకు కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

తల్లి తిలకం దిద్దుతుంటే ఎమోషనల్‌గా
హల్దీ వేడుక సందర్భంగా కాజల్‌ను పెళ్లి కూతురుగా తయారు చేస్తూ తన తల్లి తిలకం దిద్దుతూ భావోద్వేగం కావడంతో కాజల్‌లో ఆ ఎమోషన్స్ కనిపించాయి. ఈ వేడుక కోసం పూలుతో చేసిన మాలలను, ప్రత్యేకంగా తప్పించిన పుష్పాలతో కాజల్‌ను అలంకరించారు.

కాబోయే భర్తతో డ్యాన్స్ చేస్తూ
హల్దీ వేడుకలో కాబోయే భర్త గౌతమ్ కిచ్లూ కూడా పాల్గొన్నారు. గౌతమ్‌తో కలిసి డ్యాన్సులు చేస్తూ ఈ అందాల భామ కనిపించింది. ప్రియుడి కళ్లలోకి తన్మయత్నంగా చూస్తూ ఉండిపోయింది. పెళ్లికి ముందు ఉండే మధురానుభూతిని కాజల్ పొందుతూ కనిపించింది.

సోదరి నిషా అగర్వాల్ హుషారుగా
ఇక పెళ్లికి ముందు జరిగిన డ్యాన్స్ పార్టీలో తన సోదరి, టాలీవుడ్ హీరోయిన్ నిషా అగర్వాల్ స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఫ్యామిలీ సభ్యులందరూ కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. నిషా పింక్ కలర్ గాగ్రా దుస్తుల్లో మురిసిపోయారు.

శుక్రవారం పెళ్లి కార్యక్రమం
కాజల్, గౌతమ్ కిచ్లూ వివాహం అక్టోబర్ 30వ తేదీన ముంబైలోని తన నివాసంలో అత్యంత నిరాడంబరంగా జరిపించాలని కుటుంబ సభ్యులు భావించారు. ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది మంది సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ముంబైలో లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతున్న కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

శుక్రవారం సాయంత్రం పెళ్లి విందుకు..
ఇక శుక్రవారం పెళ్లి జరిగిన తర్వాత దక్షిణాది, బాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ఓ విందును కాజల్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి కొద్ది మంది సినీ ప్రముఖులు హాజరవుతున్నట్టు తెలిసింది. పెళ్లి విందుకు తన సన్నిహితులైన కొందరిని ఆహ్వానించినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక టాలీవుడ్ నుంచి కొందరు యువ, సీనియర్ హీరోలు పార్టీకి హజరవుతున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











