పెళ్లికి ముందు కండలు చూపిస్తున్న కాజల్.. మెహందీ, సంగీత్ పక్కన పెట్టేసి..
అందాల భామ కాజల్ అగర్వాల్ పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముంబైలోని తమ నివాసంలోనే అతి నిరాడంబరంగా పెళ్లిని జరిపించేందుకు ఇరు కుటుంబాలు కసరత్తు చేస్తున్నాయి. ముంబైలో ఇంటీరియర్ బిజినెస్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న గౌతమ్ కిచ్లూను కాజల్ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే తన సోదరి కాజల్ పెళ్లి గురించి సినీ నటి నిషా అగర్వాల్ ఇన్స్‌టాగ్రామ్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

29వ తేదీన మెహందీ ఫంక్షన్
కాజల్ పెళ్లిలో భాగంగా అక్టోబర్ 29 తేదీన మెహందీ వేడుకను కుటుంబ సభ్యులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి వేడుకలు దగ్గర పడటంతో ఇంటిలో సందడి జోరు పెరిగింది. అత్యంత సన్నిహితులు రాకపోకలు, పెళ్లి శుభాకాంక్షలకు సంబంధించిన ఫోన్ కాల్స్‌తో బిజీ అయిపోయారు. పెళ్లి రోజుకు కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయారు.

పెళ్లికి ముందు వర్కవుట్లతో బిజీ
ఇంట్లో పెళ్లి పనులు జోరందుకొంటుంటే.. కాజల్, నిషా అగర్వాల్ మాత్రం వర్కవుట్లతో బిజీగా మారిపోయారు. ఇంటిలోని జిమ్‌లో చెమటలు కక్కేలా ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. వర్కవుట్లకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకొన్నారు. అక్కా, చెల్లెల్లు మంచి జోష్‌లో కనిపించారు.

కండలు చూపిస్తూ.. మెహందీకి సిద్ధం అంటూ..
ఇంటిలో వర్కవుట్లు చేసిన తర్వాత కండలు చూపిస్తూ కాజల్, నిషా అగర్వాల్ ఫొటోకు ఫోజిచ్చారు. ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతున్నది. ఈ సమయంలో వర్కవుట్లలో బిజీగా ఉండిపోయాం. మెహంది సిద్ధంగా ఉంది.. వచ్చి పెట్టేయండి అంటూ నిషా అగర్వాల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేసి కామెంట్ పెట్టారు.

కాజల్ సంగీత్ వేడుక కోసం రంగం సిద్ధం
ఇక కాజల్, గౌతమ్ కిచ్లూ పెళ్లి అక్టోబర్ 30వ తేదీన ముంబైలోని తమ నివాసంలో జరుగనున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం ఈ పెళ్లిని నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు చొరవ తీసుకొంటున్నాయి. పెళ్లికి ముందు రోజున అంటే 29వ తేదీన రాత్రి అతికొద్ది మందితో సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











