కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తి ఎంతంటే.. కొన్ని కోట్లకు వారసుడో తెలుసా?

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి వార్త సినీ పరిశ్రమలోని ప్రముఖులను, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. కొద్దికాలంగా ఎంగేజ్‌మెంట్ జరిగిందనే విషయం ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడంతో దానిపై సందిగ్ధత నెలకొని ఉంది. అయితే ఉన్నట్టుండి తన పెళ్లి అక్టోబర్ 30న ముంబైలో జరుగుతుందని ప్రకటించగానే సహచర నటులు, అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. అయితే పెళ్లి కొడుకు ఎవరు, బ్యాక్‌గ్రౌండ్ ఏమిటని అనే విషయాలను అభిమానులు ఆరా తీస్తుండటంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే..

Recommended Video

Kajal Aggarwal's Fiency Gautam Kitchlu's Net Worth Details
 ముంబై అమెరికాలో చదువు

ముంబై అమెరికాలో చదువు

ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లూ క్యాథేడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చదువుకొన్నాడు. ఆ తర్వాత ఉన్న విద్య కోసం అమెరికాకు వెళ్లి టప్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చి సొంతంగా లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన డిజైన్ కంపెనీ ది ఎలిఫాంట్ అనే కంపెనీని 2012లో ప్రారంభించారు.

2015లో సొంతంగా డిజైనర్ కంపెనీతో

2015లో సొంతంగా డిజైనర్ కంపెనీతో

ఆ తర్వాత 2015లో డిస్క్రెన్ లివింగ్ అనే పేరుతో మరో లైఫ్‌స్టైల్ డిజైన్ కంపెనీని గౌతమ్ కిచ్లూ ప్రారంభించారు. గత ఐదేళ్లుగా ముంబైలో ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేస్తూ ఆన్‌లైన్‌లో కూడా బిజినెస్‌ను విస్తరిస్తున్నారు. ముంబైకి చెందిన ఓ ఫైనాన్సియల్ వెబ్‌సైట్ అంచనా వేసిన ప్రకారం గౌతమ్ కిచ్లూ నికర ఆస్తి రూ.50 కోట్లు అని తేల్చారు.

ముంబై మారథాన్ రేసులో..

ముంబై మారథాన్ రేసులో..

వ్యాపారంలోనే కాకుండా ఫిట్‌నెస్‌పైనా గౌతమ్ కిచ్లూ అమితమైన ఆసక్తిని కనబరుస్తారనే విషయం ఆయన జీవన విధానమే చెప్పింది. ఇప్పటి వరకు ముంబై మారథాన్‌లో ఏడుసార్లు పాల్గొన్నారు. ఈ మారథాన్ పోటీలో గత ఏడాది కంటే 2020లో అద్బుతమైన ఫలితాన్ని రాబట్టానని సోషల్ మీడియాలో చెప్పారు. ఫిట్‌నెస్‌లో కొత్త లెవెల్‌ను అందుకోవడం హ్యాపీగా ఉంది అంటూ గౌతమ్ కిచ్లూ పేర్కొన్నారు.

అక్టోబర్ 30న పెళ్లి

అక్టోబర్ 30న పెళ్లి

సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే కాజల్ అగర్వాల్‌ కొద్ది నెలలుగా గౌతమ్ కిచ్లూతో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఓ సందర్భంలో తనకు జోడి దొరికాడంటూ ట్విట్టర్‌లో నర్మగర్భంగా ఓ ఫోటోను పెట్టింది. చివరకు పెద్దల అంగీకారంతో గౌతమ్ కిచ్లూ, కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే తన చెల్లెలికి పెళ్లి జరిగి ఓ బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X