కాజల్ అగర్వాల్‌కు పెళ్లి విషయంలో అసంతృప్తి.. పాపం కారణం అదేనంటా!
దశాబ్ద కాలంగా సినిమా పరిశ్రమలో రాణిస్తున్న కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కొద్ది నెలలుగా వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే చాలాకాలం తన పెళ్లి వార్తలపై మౌనంగా ఉన్న కాజల్ తాజాగా తన వివాహ తేదీని మీడియాలో వెల్లడించింది. దాంతో కాజల్ పెళ్లి విషయం ఇంటర్నెట్ మీడియాను ఊపేసింది. అయితే తన పెళ్లి విషయంలో కాజల్ కొంత అసంతృప్తిగా ఉందనే విషయం సన్నిహితులు పేర్కొంటున్నట్టు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. కాజల్ అసంతృప్తికి కారణం ఏమిటంటే..
Recommended Video

గౌతమ్‌తో రెండేళ్లుగా డేటింగ్‌తో
కాజల్ అగర్వాల్ సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే మరో పక్క ప్రియుడు గౌతమ్ కిచ్లూతో అఫైర్ కొనసాగించారు. గత రెండేళ్లుగా ప్రియుడితో చెట్టాపట్టాల్ వేసుకొని డేటింగ్ చేశారు. అయితే కరోనా లాక్‌డౌన్ సమయంలో రెండు కుటుంబాలు వారికి వివాహం చేయాలని నిర్ణయించడంతో కాజల్ పెళ్లికి సిద్ధమైనట్టు తెలిసింది.

లాక్‌డౌన్‌కు ముందే పెళ్లి ప్లాన్స్
వాస్తవానికి ముందు లాక్‌డౌన్ కంటే ముందుగానే పెళ్లి చర్చలు జరుగుతున్నాయనే విసయం తాజాగా బయటకు వచ్చింది. అయితే లాక్‌డౌన్‌కు ముందు డెస్టినేషన్ వెడ్డింగ్ పెళ్లిని జరిపించాలని ప్లాన్ చేసుకొన్నది. అయితే లాక్ డౌన్ కారణంగా తన పెళ్లి ప్లాన్స్ బెడిసికొట్టడంతో కాస్త అసహనం, అసంతృప్తి కలిగిందనే విషయాన్ని జాతీయ మీడియాలో వచ్చిన కథనంలో పేర్కొన్నారు.

పెళ్లి వేడుక విషయంలో అసంతృప్తి
ఎవరికైనా పెళ్లి అనేది జీవితంలో మధురమైన ఘట్టం. ఆ క్రమంలో వివాహ వేడుక అద్భుతంగా సాగాలనుకోరుకొంటారు. కానీ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో మహారాష్ట్రలోని ఓ విడిది ప్రాంతంలో ఘనంగా పెళ్లి చేసుకోవాలని లేదా ముంబైలోని స్టార్ హోటల్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని ఆశలు కూడా కాజల్ తీరలేదు. ముంబైతోపాటు మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పెళ్లిపై ఆంక్షలు కొనసాగుతుండటంతో మళ్లీ కాజల్ ప్లాన్స్‌పై దెబ్బ పడ్డాయి.

ముంబైలోని తన ఇంటిలోనే అత్యంత నిరాడంబరంగా
ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. కాజల్ పెళ్లి అత్యంత నిరాడంబరంగా తన ఇంటిలోనే ఇరు కుటుంబాల సమక్షంలో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యేలా పరిమితి విధించుకొన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ కొంత అసంతృప్తితో ఉన్నారని, సినీ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ వర్గాల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనే ఆశలు ఇప్పుడు అడియాశలుగా మారిపోయాయి.

పెళ్లి తర్వాత విదేశాల్లో హానీమూన్
కాజల్ పెళ్లిని తొలుత ఏదైనా హోటల్‌లో చేయాలని అనుకొన్న కరోనా ఆంక్షల నేపథ్యంలో ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లోని తన నివాసంలో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఆగస్టు 30వ తేదీన కాజల్ వివాహం గౌతమ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కాజల్ తన హానీమూన్ కోసం దుబాయ్, మాల్దీవులకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











