దర్శకుడితో కాజల్ రొమాన్స్.. పెళ్లి తరువాత కూడా అలాంటివి తగ్గించట్లేదుగా..
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్. ఎలాంటి సినిమా చేసినా కూడా అమ్మడు రొమాన్స్ గ్లామర్ సమపాళ్లలో ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న తరువాత అమ్మడు మళ్ళీ సినిమాల్లో కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి. కానీ వెంటనే యధావిధిగా సినిమాల్లో ఉంటానని క్లారిటీ ఇచ్చేసింది. ఇక పెళ్లి తరువాత కాజల్ ఒక విషయంలో అస్సలు తగ్గడం లేదు.

వాళ్ళ మధ్య అనుబంధం.. ఏ రేంజ్ లో ఉందంటే
దాదాపు ఏడేళ్ళకు పైగా డేటింగ్ అనంతరం కాజల్ పెళ్లి చేసుకుంది. కాజల్ గౌతమ్ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. అంటే వాళ్ల మధ్య ఎలాంటి అనుబంధం ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇక వ్యాపారంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆదాయాన్ని పెంచుకునే ప్లాన్స్ కూడా వేస్తున్నారు.

పెళ్లి అలా జరిగిపోయింది
కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న గౌతమ్ ను హిందు సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని ఒక ఒక ప్రయివేట్ హోటల్ లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చాలా సింపుల్ గా అతికొద్ది మద్ది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి వేడుకను ముగించారు. ఇక ఆ వేడుకకు సినీ తారలు పెద్దగా హాజరుకాలేదు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

పెళ్లి టారువత కూడఖ్ మారలేదు
పెళ్లి తరువాత కాజల్ జీవితంలో మార్పులు రావచ్చని చాలా రూమర్స్ వచ్చాయి. గతంలో చాలా మంది హీరోయిన్స్ అందుకు ఉదాహరణగా నిలిచారు. కానీ సమంత కాజల్ వంటి వారి కెరీర్ లో పెద్దగా మార్పులు రాలేదు. గ్లామర్ ప్రపంచంలో వారి రెగ్యులర్ లైఫ్ ఇంతకుముందు ఎలా ఉందొ ఇప్పుడు కూడా అలానే ఉంది.

దర్శకుడితో రొమాన్స్ కూడా..
పెళ్లి తరువాత కాజల్ కూడా రొమాంటిక్ రోల్స్ కు దూరంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఆమె అలాంటిదేమి లేదన్నట్లుగా ఒక డైరెక్టర్ హీరోగా చేస్తున్న సినిమాలో రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది. ఆయన మరెవరో కాదు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా. ప్రభుదేవా ప్రస్తుతం డైరెక్టర్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

దర్శకుడాతో.. రొమాన్స్ గట్టిగానే ఉంటుందట
ఇక త్వరలో డీకే అనే తమిళ దర్శకుడు తెరకెక్కించనున్న ఒక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో ప్రభుదేవా హీరోగా నటించనున్నాడు. అయితే ఆ సినిమాలో కాజల్ గ్లామర్ రోల్ లో కనిపించనుంది. పెళ్లి తరువాత కాజల్ ఇంతవరకు హేవి రొమాన్స్ సినిమా చేయలేది. ఇప్పుడు ప్రభుదేవాతో మాత్రం రొమాన్స్ గట్టిగానే ఉంటుందట. మరి చందమామ ఎలాంటి కికొస్తుందో చూడాలి.

సినిమాల్లోకి కాజల్ భర్త..
కాజల్ తన భర్తను కూడా సినిమాల్లోకి లాగాలని చూస్తున్నట్లు సమాచారం. ఇంటీరియర్ బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కు పెద్దగా సినీ ఫీల్డ్ తో టచ్ లేదు. అయితే కాజల్ కు ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ఆమె ద్వారానే సినిమా బిజినెస్ లోకి రనున్నాడట. త్వరలోనే గౌతమ్ కిచ్లు ఒక బిగ్ ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా ఉంటూ పెద్ద హీరోలతో సినిమాలు ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. అవసరం అయితే కాజల్ తో చిన్న బడ్జెట్ లోనే లేడి ఓరియెంటెడ్ సినిమాలను కూడా నిర్మించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











