Kajal Aggarwal పెళ్లి రోజున భర్తతో కాజల్ రొమాంటిక్‌గా.. హనీమూన్‌తోపాటు ఆ ఫోటోలు షేర్ చేసి..!
కాజల్ అగర్వాల్.. సోషల్ మీడిాయలో ఫుల్ యాక్టివ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఆమె ఎప్పటికప్పుడూ భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ.. నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. అంతే కాదు తన హాట్ ఫోటోస్ కూడా షేర్ చేస్తూ కుర్రాళ్లకు మంటలు రేపుతుంది. అయితే ఈ క్రమంలో ఈ భామ సోషల్ మీడియాలో తన పెళ్లి రోజు సందర్భంగా ఓ స్పెషల్ అల్బమ్ ను షేర్ చేసింది. తన భర్తతో కలిసి ఉన్నటువంటి కొన్ని క్యూట్ అండ్ రేర్ రొమాంటిక్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...
టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా ఉండగానే... తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఇక వీరి పెళ్లి జరిగి అక్టోబర్ 30వ తేదీకి మూడేళ్లు. గౌతమ్, కాజల్ పెళ్లి ముంబయిలో అంగరంగ వైభవంగ్ అథిరథమహాుల మధ్య జరిగింది. ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. సంవత్సరం కాగానే పిల్లాడిని కన్నారు. ఇక ప్రస్తుతం వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు.

ఇక కూమారుడి పేరు నీల్ కిచ్లు అంటూ నామాకరణం చేశారు. ఇక కాజల్ తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తునే... సినిమాల్లోనూ నటిస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. చందమామ లైఫ్ ను సాగిస్తుంది. ఇక కాజల్ మూడవ పెళ్లి రోజు కావడంతో తన భర్తతో కలిసి ఉన్న రేర్ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. మూడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి అంటూ తమ పెళ్లిరోజును గుర్తు చేసుకుంది.
ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్, సెలబ్రేటీలు.. కాజల్ అగర్వాల్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ ఫోటోల్లో కాజల్ తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. కాజల్, గౌతమ్ కిచ్లు జంటగా పలు వేకేషన్లు, టూర్లకు తిరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్బంగా భర్తతో క్యూట్ గా ఫోజులిచ్చిన పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. ఈ అరుదైన చిత్రాలకు ఫ్యాన్స్ సైతం ఫిదా అయిపోయి... ట్రెండింగ్ గా మార్చేస్తున్నారు.

పెళ్లిరోజు ఫోటోల నుంచి.. హానీమూన్ దగ్గరకు వెళ్లిన ఫోటోలు సైతం షేర్ చేసింది. ఇక ప్రెగ్నెన్సీ టైం లో బేబీ బంప్ తో ఉన్న ఫోటోస్ కూడా పంచుకుంది. ప్రస్తుతం చందమామ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇటీవల కాజల్ తన కొత్త ఇంటికి ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. భర్త కిచ్లూతో కలిసి తను నూతన గృహప్రవేశం చేసింది. ఆ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.
కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ బాగానే కలిసి వస్తోంది. ఇటీవల బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ భామ ఇండియన్ 2 లో కమల్ హాసన్ తో కలిసి నటిస్తుంది. మరోవైపు సత్య భామ అనే సినిమాలో కూడా నటిస్తుంది.


Click it and Unblock the Notifications











