పిల్లల్ని కనకుండానే ఆ ఆనందం తెలిసింది.. అతనే సర్వస్వం: కాజల్

లక్ష్మి కళ్యాణం సినిమాతో తెరంగేట్రం చేసి దశాబ్ద కాలంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న కాజల్ అగర్వాల్ ఇటీవలే హాఫ్ సెంచరీ పూర్తిచేసి 51 వ సినిమాగా సీత మూవీ చేసింది. తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని భాషా చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంటున్న ఈ భామ ఇంకా కన్యగానే జీవితం సాగిస్తోంది. 1985 సంవత్సరంలో జన్మించిన ఈమెకు దాదాపు 33 సంవత్సరాలు. అయినా పెళ్లి మాటెత్తడం లేదు. ఈమె చెల్లెలికి పెళ్ళై కొడుకు కూడా పుట్టేశాడు. కానీ తాను మాత్రం పెళ్లి పై కొన్ని కండిషన్స్ పెట్టుకున్నానని అంటోంది కాజల్. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ చెప్పిన విషయాలు ఆశ్చర్య పర్చాయి.

ఇంటర్వ్యూలో భాగంగా తన పెళ్లి గురించి స్పందించిన ఈ ముద్దుగుమ్మ.. తనకు ఖంగారు పడి పెళ్ళి చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయాలు కుదరక విడిపోవడం లాంటి విషయాలు అస్సలు నచ్చవని తెలిపింది. అందుకే బాగా ఆలోచించి, ఫిల్టర్ చేసి తనకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను తప్ప ఆదరాబాదరా అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఇక తన చెల్లి కొడుకు ఇషాన్ గురించి మాట్లాడిన ఈమె.. పేరుకు ఇషాన్ తన చెల్లెలి కొడుకే అయినా అతని గురించే తాను ఎక్కువగా ఆలోచిస్తానని, ఆ చిన్నారి తనను ఏది అడిగినా ఇవ్వాలని తపన పడుతుంటానని ఇషాన్ పై ప్రేమను బయటపెట్టింది కాజల్.

kajal shares her openion on marriage

అంతేకాదు అమ్మతనం లోని ఆనందాన్ని పిల్లలు కనకుండానే ఇషాన్ ద్వారా తెలుసుకున్నానని ఈ సందర్బంగా పేర్కొంది కాజల్. వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తనకు చెల్లి కొడుకు ఇషాన్ మాత్రమే సర్వస్వం అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. ఇక తన దృష్టిలో సినిమా కెరీర్ అనేది ఓ ఉద్యోగం లాంటిది మాత్రమే అని చెబుతూ తన జీవితంలో సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని పేర్కొంది కాజల్. తన 51 వ సినిమా సీత మే 24వ తేదీన విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X