కాబోయేవాడి కౌగిలిలో కాజల్
టాలీవుడ్ టాల్ బ్యూటీ కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందన్న సంగతి తెలిసిందే. ఇక అమ్మడి పెళ్లిపై ఎప్పటినుంచో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాజల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పెళ్లి డేట్ ని ప్రకటించింది. 'నేను ఎస్ చెప్పాను' అని పోస్ట్ పెట్టిన కాజల్ .. త్వరలో వివాహమాడబోతున్నట్లు ప్రకటించేసింది.
ముంబైకి చెందిన బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుతో త్వరలో కాజల్ పెళ్లి జరగబోతుంది..అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది. ముంబైలోని ఓ హోటల్ లో ఈ పెళ్లి జరగబోతుంది. కరోనా మహమ్మారి వలన ఈ వేడుకకి అత్యంత సన్నిహుతులు మాత్రమే హాజరుకానున్నారని తెలిపింది కాజల్.ఇప్పటికే వరుడు గౌతమ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే జంటగా ఉన్న ఫోటో ఇంతవరకూ క్లారిటీగా బయటకు రాలేదు. కాజల్ కు కాబోయేవాడిని చూడాలని చాలామంది గూగుల్ ను గాలించేసారు .. ఇంతలో కాజల్ తనకు కాబోయే వాడితో ఇలా ఫోటోకు ఫోజ్ ఇచ్చింది.
విజయదశమి సందర్భంగా అభిమానులు కోరుకుంటున్నట్లు అదిరిపోయే ఫోటోల్ని షేర్ చేసింది. ఈ ఫోటోలో కాజల్ - గౌతమ్ జంట చిరునవ్వులు చిందిస్తూ కనిపించరు. ఇక ఈ ఫోటో పై అమ్మడి అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.


Click it and Unblock the Notifications











