లేటు వయసులో ఘాటు ఆఫర్లు... సీనియర్ హీరోలకు మంచి జోడిగా మారిన కాజల్
సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరిగే కొద్ది ఆఫర్లు తగ్గుతూ ఉంటాయి. కానీ, కాజల్ అగర్వాల్ విషయంలో మాత్రం దీనికి రివర్స్ లో జరుగుతోంది. సీనియర్ హీరోలకు అమ్మడు పెద్ద ఎసట్ లా మారుతోంది. ఇటీవలే చిరంజీవి ఆచార్య సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన ఈ కుందనపు బొమ్మ తాజాగా కమల్ హాసన్ సరసన రెండోసారి హీరోయిన్ గా అవకాశాన్ని కొట్టేసింది.
ఆ మధ్య డైనమిక్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 సినిమాలో కాజల్ మెయిన్ లీడ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న రాఘవన్ సీక్వెల్ లోనూ అమ్మడినే హీరోయిన్ గా కన్ఫామ్ చేశారు. ఇక రాఘవన్ 2 సినిమాలో కాజల్ తో పాటూ కీర్తి సురేష్ కూడా నటించబోతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం గౌతమ్ ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ పనిలో తలమునకలై ఉన్నాడు. మరోవైపు ఏం మాయ చేశావే సినిమాకూ సీక్వెల్ ను తీసుకురాబోతున్నాడన్న విషయం తెలిసిందే. ఇక చియన్ విక్రమ్ తో తెరకెక్కించిన ధృవ నక్షత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, అది ఎప్పటికి వెలుగు చూస్తుందో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











