పప్పులో కాలేసిన కాజోల్.. అలియాభట్ విషయంలో దారుణంగా..
బాలీవుడ్‌లో హాటెస్ట్ లవర్స్ ఎవరంటే రణ్‌బీర్ కపూర్, అలియాభట్ అని ఠక్కున చెబుతారు. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని జోరుగా డేటింగ్ చేస్తున్నారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాల అంగీకారం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలియా కపూర్ కుటుంబంలోకి అడుగుపెడుతుందని చెప్పడానికి కాజోల్ నోటి నుంచి వచ్చిన మాటలే అందుకు సాక్ష్యంగా నిలిచాయి.
ఇటీవల నేహా దూపియా నిర్వహించే షోకు కాజోల్ హాజరయ్యారు. ఓ సందర్భంలో అలియా భట్ గురించి మాట్లాడుతూ.. అలియా కపూర్ అంటూ సంభోదించింది. అంత లోనే తేరుకొని అలియా కపూర్ కాదు.. సారీ.. అలియా భట్ అంటూ సరిదిద్దే ప్రయత్నం చేసింది. అలియా కపూర్ అని కాజోల్ చెప్పిన మాటలను వీడియో రూపంలో నేహా దూపియా షేర్ చేసింది.

పీకల్లోతూ ప్రేమలో ఉన్న రణ్‌బీర్ కపూర్, అలియా ప్రస్తుతం ఆయన్ ముఖర్జీ రూపొందించే బ్రహ్మస్త్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











