ఆ మాటల్ని సీరియస్‌గా తీసుకోకండి.. పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్‌ కామెంట్స్‌పై కాజోల్‌

Actress Kajol: బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల తన వ్యాఖ్యల వల్ల వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్'లో పాల్గొని, "పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి. వివాహ బంధం, సంబంధాల విలువ వంటి సున్నితమైన అంశాలపై ఇలాంటి కామెంట్స్ చేయడంతో కొంతమంది ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంబంధాల స్థిరత్వం, కుటుంబం అనే భావనను తేలికగా తీసుకున్నారనే విమర్శలు వెలువడ్డాయి. ఈ కామెంట్స్ కాజోల్ స్పందించారు.

ఈ విమర్శల నేపథ్యంలో తాజాగా ప్రసారం చేసిన కొత్త ఎపిసోడ్‌లో కాజోల్ ఈ చర్చకు నేరుగా స్పందించారు. షోలోని ఒక సెగ్మెంట్ ప్రారంభించే సమయంలో ఆమె మాట్లాడుతూ.."ఇప్పుడిక మనం రెండో విభాగంలోకి వెళ్తాం... ఇది మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టిన భాగం. దయచేసి సరదా సంభాషణల్లో చేసే వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు" అని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. అంటే.. షోలో జరిగే చర్చలు నిజ జీవిత సలహాలుగా కాకుండా ఫన్నీగా తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

Kajol Clarifies Marriage Expiry Date Remark After Social Media Backlash on Two Much Show

కాజోల్ వ్యాఖ్యల వెంటనే సహ హోస్ట్ ట్వింకిల్ ఖన్నా కూడా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.."ఈ కార్యక్రమంలో మాట్లాడే విషయాలను సీరియస్‌గా తీసుకోవద్దని, మేము మొదటి ఎపిసోడ్ నుంచే డిస్క్లైమర్ ఇస్తున్నాం. మళ్లీ చెబుతున్నాం.. మా సలహాలు అమలు చేయకండి" అని చెప్పారు. ట్వింకిల్ వ్యాఖ్యలు షో కాన్సెప్ట్‌ను మరింత క్లారిటీ ఇచ్చారు. మా మాటల్లోని ఉద్దేశం ఫన్ మాత్రమేననీ, ప్రేక్షకులు అవి నిజ జీవిత నిర్ణయాలకి ప్రమాణంగా తీసుకోవడం తగదని ఆమె అన్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే?
గతవారం 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' అనే షోలో ట్వింకిల్ ఖన్నా, హీరోయిన్ కాజోల్, విక్కీ కౌశల్, కృతి సనన్ పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్‌లో "పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రీన్యువల్ ఆప్షన్ ఉండాలా?" అనే ప్రశ్న ముందుకు రావడంతో ట్వింకిల్ మాట్లాడుతూ.. "అది పెళ్లి... వాషింగ్ మెషీన్ కాదు" అని జవాబిచ్చారు. ఆ వ్యాఖ్యలకు కాజోల్ తన అభిప్రాయాన్ని జోడిస్తూ.. "నేను కూడా అదే అనుకుంటున్నా. అయితే రీన్యువల్ చేసే అవకాశం ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఎక్స్‌పైరీ డేట్ ఉంటే ఎవరూ ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు" అని ఫన్నీ గా సమాధామిచ్చింది.

అయితే.. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసింది. వారి వ్యాఖ్యలు ఫన్నీగా అనిపించినప్పటికీ, సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు "వివాహ బంధం పవిత్రతను తేలికగా తీసుకోవడం", "సంబంధాలను వినోదంగా చూపించడం" అంటూ విమర్శించారు. వాస్తవానికి షో క్రియేటర్లు ప్రారంభం నుంచే ఇది పూర్తిగా వినోదం కోసం రూపొందించబడిన కార్యక్రమమని, సరదా సంభాషణలు, ప్రశ్నలు, చమత్కారాలే ఈ టాక్‌ షో లక్షణాలని చెబుతున్నారు. కానీ ప్రముఖులు పాల్గొనడం, వారు వ్యక్తిగత జీవిత అనుభవాలను పంచుకోవడంతో ప్రేక్షకులు కూడా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా కాజోల్, ట్వింకిల్ ఖన్నాల క్లారిటీతోనైనా.. ఈ వివాదానికి ఎండ్ కార్డు పడుతుందో వేచిచూడాలి.

More from Filmibeat

Read more about: twinkle khanna kajol bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X