నా భర్త క్రైమ్ పార్ట్నర్ .. పెళ్లి రోజు హీరోయిన్ షాకింగ్ పోస్ట్

బాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్స్ లో చాలామంది హీరో అండ్ హీరోయిన్స్ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు ఉన్న ట్రెండ్ లో నటీనటులు మాత్రమే కాకుండా కొన్ని దశాబ్దాల కితం నటీనటులు కూడా ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని ఇప్పటికీ లైఫ్ ని సాఫీగా గడుపుతున్నారు. కాగా ఇలాంటి స్టార్ కపుల్స్ లో స్టార్ జంట నటుడు అజయ్ దేవగన్ అలాగే కాజోల్ దేవగన్ ల జంట కూడా ఒకటి.

కాగా ఇద్దరూ బాలీవుడ్ లో పెద్ద స్టార్సే అని అందరికీ తెలిసిందే. కాగా అజయ్ దేవగన్ వరుస హిట్స్ తో కూడా ఫామ్ లో ఉండగా కాజోల్ మళ్ళీ ఓటిటిలో రీఎంట్రీ ఇచ్చి పలు బోల్డ్ సీన్స్ చేసేందుకు కూడా సిద్ధమే అని ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ వాలెంటైన్స్ డే వచ్చింది. మరి ఆరోజు అందరు ప్రేమికులకు ఎంత ప్రత్యేకం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

kajol crazy post on husband ajay devgn on their marriage day

ఇలా చాలా మంది ఇతర స్టార్ జంటలు ఒకరికి ఒకరు. తమ విషెస్ కూడా చెప్పుకున్నారు. ఇలానే అజయ్ దేవగన్ కూడా తన లవ్ కాజోల్ కి వాలెంటైన్స్ డే చెబుతున్నట్టుగా ఇద్దరి పిక్ పెట్టి మరీ విష్ చేస్తే కాజోల్ మాత్రం భిన్నంగా కేవలం తన పిక్ మాత్రమే పెట్టుకొని తనకి తానే వాలెంటైన్ నాకు నేనే లవ్ నన్నే ప్రేమించుకుంటున్నాను అంటూ చేసిన పోస్ట్ ఇద్దరి విషయంలో వైరల్ గా మారింది.

మెయిన్ గా కాజోల్ పై అయితే అజయ్ దేవగన్ ఫ్యాన్స్ నార్త్ నెటిజన్స్ నడుమ విమర్శలు కూడా చేసేలా చేసింది. కానీ ఇపుడు సీన్ కట్ చేస్తే నేడు తమ పెళ్లిరోజు మాత్రం ఊహించని పోస్ట్ చేసింది. నేడు ఇద్దరి పెళ్లి రోజు సందర్భంగా ఇద్దరు నడుమ ఉన్న ఓ క్లోజ్ పిక్ పెట్టి 26 ఏళ్ళు తమ దాంపత్య జీవితం కంప్లీట్ చేసుకున్నామని తమకి విష్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు.

kajol crazy post on husband ajay devgn on their marriage day

అయితే ఇందులో తాము ఇద్దరం క్రైమ్ లో పార్ట్నర్స్ అంటూ కూడా ఓ ట్యాగ్ చేయడం జరిగింది. దీనితో మొన్న తనకి తానే లవ్ అని చెప్పుకొని ఇపుడు ఫైనల్ గా అజయ్ తో కలిసి పోస్ట్ చేయడంతో వీరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక నుంచి కౌంట్ చేసుకోకుండా లైఫ్ ని ఎంజాయ్ చెయ్యండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా మొత్తానికి కాజోల్ ఫ్యాన్స్ అందరినీ ఇలా కూల్ చేసేసింది అని చెప్పవచ్చు. కాజోల్ రీసెంట్ గా అడల్ట్ సినిమా "లస్ట్ స్టోరీస్ 2" లో కనిపించగా అజయ్ దేవగన్ మన తెలుగులో RRR సినిమాలో కనిపించారు. ఇక వీటి తర్వాత భోళా, సైతాన్ లాంటి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న తాను ఇపుడు మరో క్రేజీ సీక్వెల్ సన్నాఫ్ సర్దార్ 2 లో బిజీగా ఉన్నారు. కాగా ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ ఏడాదిలోనే రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: kajol ajay devgn
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X