జీవితాంతం భరించలేం.. పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాల్సిందే... హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ సెలబ్రెటీలు విడాకులతో షాకిస్తున్నారు. ఎప్పుడు? ఎవరు? బాంబు పేలుస్తారోనని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు టెన్షన్ పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం బుల్లితెర జంట నీల్ భట్ - ఐశ్వర్య శర్మలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సతీమణి, హీరోయిన్ కాజోల్ అగర్వాల్‌ విడాకులు, వివాహ బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

వివాదాస్పదంగా టూ మచ్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్, కరణ్ జోహార్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌ ఓటీటీ కోసం హోస్ట్ చేస్తోన్న టూ మచ్ అనే టాక్ షోలో కంటెంట్ వివాదాస్పదమవుతోంది. ఈ కార్యక్రమంలో వీరు అడిగే ప్రశ్నలు కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను ఈ ముగ్గురు అడిగిన ప్రశ్నలు దారుణంగా ఉన్నాయి. తమను పార్ట్‌నర్ ఫిజికల్‌ చీటింగ్ కంటే ఎమోషనల్ చీటింగ్ చేయడాన్నిపెద్ద ద్రోహంగా కాజోల్, కరణ్ జోహార్, ట్వింకిల్ ఖన్నాలు అభిప్రాయపడ్డారు. అయితే జాన్వీ మాత్రం కాసేపు ఆలోచించి తన దృష్టిలో రెండూ తప్పేనని తేల్చేసింది. జాన్వీ ఇంకా చిన్న పిల్ల కాబట్టి మన వయసు వచ్చాక అప్పుడే ఆమెకు అర్ధమవుతుందని మండిపడ్డారు. అయితే నెటిజన్లు మాత్రం జాన్వీని ప్రశంసిస్తూ.. ఈ ముగ్గురిని మాత్రం ట్రోల్ చేశారు. తాజాగా కాజోల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kajol wants marriage should have an expiry date renewal option in Two Much With Kajol and Twinkle show

50 ప్లస్‌లోనూ తరగని అందం
భారతీయ చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌లలో ఒకరిగా కాజోల్ గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంలో తిరుగులేదని నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ... బాలీవుడ్‌లోని టాప్ హీరోలందరితో నటించారు. గూండారాజ్ సినిమా సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో ప్రేమలో పడిన కాజోల్ ఆయనను 1999లో పెళ్లాడారు. ఈ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిద్దరూ సినిమాలతో పాటు వ్యాపారాలు నిర్వహిస్తూ బాలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 50 ప్లస్‌‌లోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో మెరిసిపోతూ కుర్ర భామలకు పోటీ ఇస్తున్నారు కాజోల్. ప్రస్తుతం తన వయసు, ఇమేజ్‌కు తగిన పాత్రలు చేస్తున్న ఆమె.. లేటెస్ట్‌గా మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్ మూవీలో నటిస్తున్నారు. ఇక అజయ్ దేవగణ్ విషయానికి వస్తే దే దే ప్యార్ దే-2, ధమాల్ 4, రేంజర్ చిత్రాల్లో నటిస్తున్నారు.

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాల్సిందే
తాజాగా టూ మచ్ విత్ కాజోల్‌ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కు విక్కీ కౌశల్, కృతి సనన్‌ జంట హాజరైంది. ఈ సందర్భంగా మాటల సందర్భంలో వివాహ బంధానికి కూడా ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా? వద్ద అన్న టాపిక్ వచ్చింది. పెళ్లికి ఎలాంటి ఎక్స్‌పైరీ ఉండదంటూ కృతి, విక్కీ, ట్వింకిల్ అభిప్రాయపడగా.. కాజోల్ మాత్రం అలా కాదంటూ విచిత్రమైన వాదన వినిపించింది. పెళ్లంటే బజారులో దొరికే వస్తువో, వాషింగ్ మెషిన్ లాంటిదో కాదని ట్వింకిల్ ఖన్నా నచ్చచెప్పాలని చూసింది.

కాజోల్ సంచలన వ్యాఖ్యలు
కానీ కాజల్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు.. వివాహ బంధానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటే మంచిదని, మనం సరైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నామన్న గ్యారెంటీ ఏంటీ? ఇలాంటి పరిస్థితులు ఎదురైతే పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటే.. జీవితాంతం భరించాల్సిన అవసరం ఉండదని కాజోల్ చెప్పింది. అలాగే వివాహ బంధానికి కూడా రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంటే మంచిదని బాంబు పేల్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. అజయ్‌తో బంధం బాలేదా? ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏమైనా చోటు చేసుకున్నాయా? త్వరలో అజయ్ - కాజోల్‌లు విడాకులు తీసుకుంటారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: kajol twinkle khanna kriti sanon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X