Trending: దీపికా పదుకునే ప్రెగ్నెన్సీ ప్రైవేట్ ఫోటోషూట్ ట్రెండింగ్.. కల్కి 2898 AD బ్యూటీ బోల్డ్ ఫోటోలు వైరల్!
ఇప్పుడు టాలీవుడ్ తో బాలీవుడ్, బాలీవుడ్ టు టాలీవుడ్ అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు మన సౌత్ సినిమా నుంచి హీరోయిన్స్ నార్త్ ఇండియా సినిమాకి వెళ్లి సెటిల్ అవ్వాలని కోరుకునేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో బాలీవుడ్ హీరోయిన్లే మన వైపు వస్తున్నారు. కాగా ఇలా తెలుగు సినిమాలో ఆల్రెడీ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఆలియా భట్, దీపికా పదుకోన్ అలాగే దిశా పటాని సహా ఇపుడు జాన్వీ కపూర్ లు తమ టాలెంట్ అండ్ గ్లామర్ షో తో మెస్మరైజ్ చేస్తూ అదరగొడుతున్నారు.
అయితే ఈ ఏడాదిలో బాలీవుడ్ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి దీపికా పదుకోన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి 2898 ఎడి" లో కనిపించి తెలుగు సినిమాకి పరిచయం అయ్యింది. షూటింగ్ లో స్వయంగా తెలుగు డైలాగ్ లనే పలికించి ఇంప్రెస్ చేసిన దీపికా ఈ చిత్రం ఆద్యంతం ఒక గర్భిణీ స్త్రీగా కనిపించిన సంగతి తెలిసిందే. కాగా సినిమాలో కూడా ఆమె బేబీ బంప్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా నాచురల్ గా చూపించాడు.

కానీ తర్వాత అదేం యాదృచ్చికమో కానీ ఈ సినిమా రిలీజ్ సమయానికి నిజంగానే దీపికా ప్రెగ్నెంట్ అయ్యింది. కాగా అలానే సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆమె పాల్గొనగా లేటెస్ట్ గా దీపికా పదుకోన్ కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ఉంది. ఎవరైనా హీరోయిన్స్ ప్రెగ్నెన్సీ వస్తే తాము తమ డెలివరీ దగ్గరికి వస్తున్నా సమయంలో ఓపెన్ గా తమ కడుపుని చూపిస్తూ ఫోటో షూట్ లు కూడా చేసుకుంటారు.
కాగా వీటిపై భిన్నాభిప్రాయాలు నెటిజన్స్ లో వస్తాయి కానీ వీటిని మాత్రం వాళ్లు ఆపరు. ఇప్పుడు ఇదే పదుకోన్ పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాదాపు ఒంటి మీద తక్కువ బట్టలే వేసుకొని తన బేబీ బంప్ తో దీపికా ఓపెన్ పిక్స్ ని పెట్టింది. దీనితో ఈ పిక్స్ ఇపుడు నెటిజన్స్ లో వైరల్ గా మారిపోయాయి. ఒక పక్క తన హాట్ షో మరో పక్క తన భర్త బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి షేర్ చేసుకున్న పిక్స్ హాట్ టాపిక్ గా మారాయి.
కాగా వీరికి పుట్టబోయే బిడ్డ ఈ సెప్టెంబర్ 28న భూమి మీదకు రాబోతుంది అని బాలీవుడ్ వర్గాల్లో టాక్. ఇలా మొత్తానికి అయితే దీపికా తన రియల్ ప్రెగ్నెన్సీ పిక్స్ తో సోషల్ మీడియాలో మంచి హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆమె ఓకే చేసిన సినిమాలు అన్నీ ఆమె తిరిగి కోలుకుని ఫిట్ అయ్యేవరకూ కొంతకాలం తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. మరి ఆల్రెడీ పూర్తి చేసిన ప్రాజెక్ట్స్ రిలీజ్ కి వచ్చాయి. బాలీవుడ్ లో సింగం అగైన్ అనే భారీ యాక్షన్ సినిమాలో దీపికా ప్రస్తుతం నటిస్తుంది.


Click it and Unblock the Notifications











