సైలెంట్‌గా పెళ్లికూతురిలా .. సింగిల్ పోస్ట్‌తో షాకిచ్చిన మృణాల్ , కుర్రాళ్ల గుండెలు బద్ధలు

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామంతో తెలుగువారిని పలకరించారు మృణాలు ఠాకూర్. తన అందం, అభినయంతో తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ మరాఠీ ముద్దుగుమ్మ ఓవర్‌ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. ఆ వెంటనే హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మృణాల్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ తొలుత 2012లో ముజ్‌సే కుచ్ కెహ్తీ.. యే ఖామోషియాన్ అనే సీరియల్‌లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2014లో విట్టి దండు అనే మరాఠీ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆపై లవ్ సోనియా , తుఫాన్, ధమాక, జెర్సీ సినిమాల్లో నటించారు మృణాల్. అలాగే కలర్స్ టీవీలో బాక్స్ క్రికెట్ లీగ్‌లో, డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే సీజన్ 7లోనూ మెరిశారు.

Kalki 2898 AD Fame Mrunal Thakur Bridal look goes viral in social media

అందం, నటనలో తిరుగులేనప్పటికీ మృణాల్ ఠాకూర్‌ బ్రేక్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసింది. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి మృణాల్ ఠాకూర్‌కు పిలుపొచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామంలో ఆమెకు హీరోయిన్‌గా అవకాశం దక్కింది. ఈ సినిమా మృణాల్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో సీతగా వింటేజ్ లుక్, మెస్మరైజింగ్ యాక్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల నుంచి మృణాల్‌కు అవకాశాలు క్యూకట్టాయి. కానీ సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ వచ్చారు.

హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలలో నటించారు మృణాల్. ఆమె ప్రస్తుతం సన్నాఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్, హేజవానీ తో ఇష్క్ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో అడవి శేష్ హీరోగా డెకాయిట్ అనే సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేశారు. టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో నటించాలని ఉందని మృణాల్ ఠాకూర్ పలుమార్లు చెప్పింది.

ఇక 30 ప్లస్‌లో ఉండటంతో పెళ్లెప్పుడు అంటూ మీడియా, సినీ జనాలు మృణాల్‌ను తెగ విసిగించేస్తున్నారు. తనను అర్ధం చేసుకునే వాడినే పెళ్లి చేసుకుంటానని.. పెళ్లి కన్నా ముందు పిల్లల్ని కనాలని ఉందంటూ మొన్నామధ్య ఆమె బాంబు పేల్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మృణాల్ ఠాకూర్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఎర్ర చీర కట్టుకుని, ఒంటి నిండా నగలతో మరాఠా సాంప్రదాయం ప్రకారం నుదిటిన బాసికం కట్టుకుని పెళ్లి కూతురిలా ముస్తాబయ్యారు మృణాల్. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో మృణాల్‌ను చూసి కొందరు అరుస్తూ , కేకలు పెడుతుండగా ఆమె ముసిముసి నవ్వులతో ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. అయితే మృణాల్ నిజంగానే పెళ్లి చేసుకుంటుందా? లేక ఏదైనా సినిమా? యాడ్ కోసం ఇలా రెడీ అయ్యారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: mrunal thakur movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X