రెండో ప్రియుడితో గర్భం.. విడాకులు ఇచ్చిన భర్తతో హీరోయిన్ మంతనాలు..

మొదటి భర్త అనురాగ్ కశ్యప్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ మరో వ్యక్తి ప్రేమలో పడిన వార్తల్లో వేడి చల్లారక ముందే.. ఆమె మరో వేడి వార్తను పుట్టించింది. తన రెండో ప్రియుడితో గర్భం దాల్చడం మీడియాలో చర్చనీయాంశమైంది. తాను డేటింగ్ చేస్తున్న గయ్ హెర్ష్‌బార్గ్‌తో తనకు సంతానం కలుగబోతున్నదనే విషయాన్ని వెల్లడించింది. దాంతో కల్కి మరోసారి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే..

 ప్రెగ్నెన్సీ టెస్ట్ తర్వాత

ప్రెగ్నెన్సీ టెస్ట్ తర్వాత

తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొన్న తర్వాత ‘నేను గర్భం దాల్చినట్టు' వైద్యులు వెల్లడించారు. అయితే నేను నమ్మలేదు. కానీ మరోసారి ధృవీకరించుకోవడానికి రెండోసారి టెస్టు చేయించుకొన్నాను. దాంతో పక్కాగా నేను ప్రెగ్నెంట్ అని తేలిపోయింది. దాంతో సంతోషంలో మునిగిపోయాను. ఎందుకంటే నేను కొద్ది రోజులుగా సంతానం కోసం ఎదురు చూస్తన్నాను. మంచో చెడో గానీ అది జరిగిపోయింది అని కల్కి పేర్కొన్నారు.

 పెళ్లి అవసరమా?

పెళ్లి అవసరమా?

పెళ్లి అనేది ప్రస్తుత సమాజంలో పెట్టించుకోవడం లేదు. పెళ్లి కాకుండా గర్భం దాల్చకూడదా? పెళ్లి అనేది రిజిస్టర్ ఆఫీసుల కోసమే. అంతేగానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. వైవాహిక జీవితంలో ప్రేమ ఉంటుందా అనేది డౌటే. ఇద్దరి బలమైన బంధం ఉంటే చాలు అని నేను నమ్ముతాను అని కల్కి పేర్కొన్నారు.

ఎవరు పుట్టినా పట్టించుకోను

ఎవరు పుట్టినా పట్టించుకోను

నా గర్బంలో పెరుగుతున్నది మగ పిల్లాడా లేదా ఆడపిల్లానా అనేది ఆలోచించను. ఎవరు పుట్టినా నాకు పెద్దగా అభ్యంతరం లేదు. పుట్టబోయే పిల్లలకు పేర్లు కూడా రెడీగా ఉన్నాయి. ఆడపిల్లయితే ఒకటి.. మగపిల్లాడైనా నా వద్ద పేర్లు ఉన్నాయి. డిసెంబర్‌లో గానీ, లేదా జనవరిలో గానీ నేను బిడ్డకు జన్మనిస్తాను అని కల్కి చెప్పింది.

అనురాగ్ కశ్యప్ ఏమన్నారంటే..

అనురాగ్ కశ్యప్ ఏమన్నారంటే..

ఇక నా మొదటి భర్త అనురాగ్ కశ్యప్‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నా ప్రెగ్నెంట్ వార్త వినగానే ఫోన్ చేసి మాట్లాడారు. పేరెంట్స్ క్లబ్‌లోకి చేరుతున్నందుకు స్వాగతించారు. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయాలని సూచించాడు. అనురాగ్‌తో నాకు పుట్టిన అమ్మాయి, ప్రస్తుతం నా సోదరుడి వద్ద పెరుగుతున్నది. మా అమ్మాయికి కావాల్సిన అన్ని విషయాలను నేను చూసుకొంటున్నాను అని కల్కి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X