నీతో ఏందిరా నాకు ఈ చావు .. ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్‌ తీరుతో కళ్యాణ్ రామ్ షాక్!

'అర్జున్ రెడ్డి' చిత్రంలో రొమాంటిక్ సీన్లతో దుమ్మరేపిన శాలిని పాండే త్వరలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా '118' చిత్రంలో కనిపించబోతోంది. సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న కళ్యాణ్ రామ్.. శాలిని పాండే గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ '118'. నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మిస్తున్నారు.

శాలిని పాండే చాలా హెల్ప్ చేసింది

శాలిని పాండే చాలా హెల్ప్ చేసింది

‘118' మూవీ ప్రారంభమైనప్పటి నుంచే శాలిని, నేను చాలా కలిసి పోయాం. చాలా మెచూర్డ్ గర్ల్. సినిమా చేస్తున్నపుడు నేను ఎక్కడైనా స్టక్ అయి ఎటువెళ్లాలో తెలియక అలా ఉండిపోతే ఆమె హెల్ప్ చేసేది. ఇన్వెస్టిగేషన్ పార్టులో సినిమా మొత్తం నాతో పాటు ట్రావెల్ చేసిందని.. కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

నీతో ఏందిరా నాకు ఈ చావు అనుకుందో ఏమో...

నీతో ఏందిరా నాకు ఈ చావు అనుకుందో ఏమో...

సెట్లో శాలిని పాండే ఎనర్జీ లెవల్స్ చూసి కొన్ని సార్లు డైరెక్టర్ గారు అంతొద్దమ్మా అని కంట్రోల్ చేసేవారు. కొన్ని సందర్బాల్లో ఆమె గోలతో నాకు చచ్చినంత పనయ్యేది. తొలి రోజు ఓ రొమాంటిక్ సీన్ చేయాల్సి వచ్చింది. నేను నడుచుకుంటూ వచ్చి సడెన్‌గా తిరిగి ఆ అమ్మాయిని పట్టుకోవాలి. నేను సరిగా చేయలేక పోయాను. డైరెక్టర్ వెళ్లి ఆ అమ్మాయికి ఏం చెప్పారో తెలియదు. ఆ అమ్మాయే నన్ను పట్టుకుని తన వైపుకు లాంగేసుకుంది. నీతో ఏందిరా సావు అనుకుందో ఏమో ఆమె నన్ను లాగేసుకుని సీన్ కంప్లీట్ చేసింది... అంటూ కళ్యాణ్ రామ్ సెట్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంటును గుర్తు చేసుకున్నారు.

118 ట్రైలర్ సూపర్

118 ట్రైలర్ సూపర్

118 ట్రైలర్ ఇటీవల విడుదలవ్వగా మంచి స్పందన వచ్చింది. ఇందులో చూపించిన సీన్లను బట్టి ఒక అమ్మాయి(నివేథా థామస్) కోసం జరిపే అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్లో హీరోకు సహాయపడే పాత్రలో శాలిని పాండే నటించారు.

మార్చి 1 రిలీజ్

మార్చి 1 రిలీజ్

బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేసిన ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కులు కె.వి.గుహ‌న్‌... దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మార్చి 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, నివేదా థామ‌స్‌, షాలిని పాండే త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాట‌లు: మిర్చి కిర‌ణ్‌, పి.ఆర్ అండ్ మార్కెటింగ్‌: వ‌ంశీ కాక‌, ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్‌.ఎం, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఫైట్స్‌: వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీశ్‌, వి.ఎఫ్.ఎక్స్‌: అద్వైత క్రియేటివ్ వ‌ర్క్స్‌, అనిల్ ప‌డూరి, నిర్మాత‌: మ‌హేష్ కొనేరు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్ర‌ఫీ, ద‌ర్శ‌క‌త్వం: కె.వి.గుహ‌న్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X