2.0 కోసం షూటింగ్‌కి డుమ్మా కొడదాం అనుకున్నా .. సాయిధరమ్ తేజ్ హీరోయిన్!

హలో చిత్రంతో కళ్యాణి ప్రియదర్శన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కానీ హలో చిత్రం విజయం సాధించకపోవడంతో వేగంగా అవకాశాలు రాలేదు. కాస్త ఆలస్యమైనా మెగా హీరో సాయిధరమ్ తేజ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. కిషోర్ తిరుమల దర్శత్వంలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్ చిత్రలహరి.

తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా కళ్యాణి ప్రియదర్శన్ సరదాగా ఓ ట్వీట్ చేసింది. షూటింగ్ కు డుమ్మా కొట్టి 2.0చిత్రం చూడాలని అనుకున్నా. కానీ మా డైరెక్టర్ ఒప్పుకోలేదు. దీనితో చేసేది లేక షూటింగ్ కు వెళ్లాల్సివచ్చిందని కళ్యాణి వాపోతోంది.

షూటింగ్ ముగియగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాకు వెళతానని చెబుతోంది. 2.0 మ్యాజిక్ ఆస్వాదించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ కెరీర్ కు చిత్రలహరి చాలా కీలకమైన చిత్రం. వరుసగా ప్లాపులతో తేజు సతమతమవుతున్నాడు. చిత్రలహరి విజయం సాధిస్తే తేజు కెరీర్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్లు అవుతుంది.

Kalyani Priyadarshan about Rajinis 2Point0

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X