ఆ ఇండస్ట్రీలో పనిచేయడం నా కల.. ఇన్నాళ్లకు నిజమైందంటోన్న భామ
హలో అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన కళ్యాణీ ప్రియదర్శన్ ను టాలీవుడ్ బాగానే ఆదరించింది. ఇదే ఏడాది రెండు చిత్రాలతో పలకరించింది ఈ భామ. చిత్రలహరి సినిమా హిట్ కాగా.. రణరంగం మాత్రం యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. రెండు సినిమాల్లోనూ కళ్యాణీ నటనకుమంచి మార్కులే పడ్డాయి కానీ అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు.
అందం, అభినయం రెండూ ఉన్న కొద్దిమంది నటీమణుల్లో కళ్యాణీ ప్రియదర్శన్ ఒకరు. అయితే లక్ మాత్రం కలిసి రావడం లేదు. ఒక్క పెద్ద హిట్టు కొట్టలేకపోతోంది. దీంతో తెలుగులో ఆమె కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ముందుగానే మిగతా దారులను కూడా వెతుకుతున్నట్లు కనిపిస్తోంది.

తెలుగుతో పాటు తమిళ్ లో క్రేజ్ తెచ్చుకుందామని ప్రయత్నించిన కళ్యాణీకి అది సాధ్యపడటం లేదు. చేసిన ఏ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవలేకపోతోంది. దీంతో తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన ఇండస్ట్రీ మాలీవుడ్ కు వెళ్లింది. కళ్యాణీ తండ్రి ప్రియదర్శన్ దర్శకుడన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా తల్లి లిస్సీ మళయాల నటి.
అయితే తాజాగా తనకు దుల్కర్ సల్మాన్ పక్కన నటించే చాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. నా తల్లిదండ్రులను ఈస్థాయిలో నిలబెట్టిన ఈ ఇండస్ట్రీలో సినిమా చేయాలన్నది నా కల.. అదిప్పుడు నిజమైంది. ఓ స్పెషల్ స్క్రిప్ట్, ఇలాంటి అద్భుతమైన టీమ్ తో మలయాళం సినిమా చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. దుల్కర్ సల్మాన్, అనూప్ మీరే నా కలను నిజం చేశారు. మీ అందరి ఆశీస్సులు కావాలి.. మీ అందరూ గర్వపడేలా చేస్తా.. మాతభూమి పిలుస్తోందంటూ పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











