సూపర్‌స్టార్ ఇంటికి కోడలిగా అక్కినేని హీరోయిన్? దిమ్మతిరిగేలా నటి తల్లి కౌంటర్

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటుల పెళ్లి వార్తలు కనిపిస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు తమ ప్రేమ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఆయా జంటలపై సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తుండగా.. వీటిలో కొన్ని మాత్రమే నిజం కాగా, మిగిలినవి నకిలీ వార్తలు. తాజాగా తన కూతురు పెళ్లికి సంబంధించి మీడియాలో వస్తున్న గాసిప్స్‌కు చెక్ పెట్టారు ఆ నటి తల్లి. ఈ వివరాల్లోకి వెళితే..

సదరు హీరోయిన్ ఎవరో కాదు.. కళ్యాణి ప్రియదర్శన్. బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఆమె వెండితెరపై అడుగుపెట్టారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, అలనాటి నటి లిజీ దంపతుల ముద్దుల కుమార్తె కళ్యాణి. అక్కినేని నాగచైతన్య సరసన హాలో చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు కళ్యాణి. ఆ తర్వాత తెలుగులోనే చిత్రలహరి, రణరంగం సినిమాలలో నటించారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ను పక్కనపెట్టి.. తన మాతృభాష మలయాళం, తమిళంపై ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యారు కళ్యాణి ప్రియదర్శన్.

Kalyani Priyadarshan- Pranav Mohanlal Marriage Lissy Priyadarshan Reacts on Rumors

లోక చాప్టర్ 1: చంద్ర మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించారు కళ్యాణి. మలయాళ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించిన తొలి మూవీగా లోక నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆమె దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. కళ్యాణి తర్వాత నటించబోయే సినిమాల గురించి కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో జినీ, మార్షల్ సినిమాలలో కళ్యాణి నటిస్తున్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కళ్యాణి వ్యక్తిగత జీవితంపై ఎన్నో రూమర్లు చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్‌తో కళ్యాణి డేటింగ్ చేస్తున్నట్లుగా ఎన్నో ఏళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. చిన్ననాటి స్నేహితుడు అయిన ప్రణవ్‌తో ఆమెకున్న ఫ్రెండ్‌షిప్ దీనికి కారణం. వీరిద్దరి రిలేషన్‌పై పలుమార్లు వీరి కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ పుకార్లు మాత్రం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

తాజాగా మరోసారి కళ్యాణి - ప్రణవ్‌ల మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ తీసుకున్న సెల్ఫీ.. అందులో ఇద్దరూ క్లోజ్‌గా ఉండటం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దాంతో ఈ కథనాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. 2022లో వీరిద్దరూ జంటగా నటించిన హృదయం మంచి విజయం సాధించింది. అందులో ప్రణవ్ - కళ్యాణిలు భార్యాభర్తలుగా నటించారు. ఈ క్రమంలో నిజ జీవితంలోనూ వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా వీటికి కళ్యాణి ప్రియదర్శన్ తల్లి లిస్సీ ప్రియదర్శన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కళ్యాణి - ప్రణవ్ మోహన్‌లాల్‌ల పెళ్లి కోసం మేం వెయిట్ చేస్తున్నామంటూ ఓ నెటిజన్లు కామెంట్ చేశాడు. దీనిపై సీరియస్ అయిన లిస్సీ వెంటనే అది తప్పుడు వార్త అంటూ రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఆమె క్లారిటీతో ఇకనైనా ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

Read more about: kalyani priyadarshan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X