Sai Pallavi తో ఆ ముగ్గురు హీరోయిన్స్ సెల్ఫీ.. ఫ్రేమ్ అదిరింది!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకరు సక్సెస్ అవుతుంటే మరొకరికి ఏమాత్రం నచ్చదని పైకి ఏదో పొగుడుతూ కనిపించిన మనసులో మాత్రం తెలియని ఒక అసూయ ఉంటుంది అని చాలామంది ఓపెన్ గానే చెబుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య మనస్పర్ధలు చాలా ఉంటాయి అని గతంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. చాలావరకు అగ్రహీరోలు ఫ్రెండ్లీగా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్స్ లో అలా ఉండేవారు చాలా తక్కువమంది కనిపిస్తారు.
అదికూడా ఇద్దరు మాత్రమే స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడతారు. అయితే ఒక ఫోటోలో మాత్రం నలుగురు హీరోయిన్స్ చాలా నవ్వుతూ అందంగా కనిపించడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గ్లామరస్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని పోస్ట్ చేసిన ఆ ఫోటోలో సాయి పల్లవి మాత్రమే కాకుండా మరొక టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి, ప్రియాంక అరుల్ మోహన్ ఇద్దరు కూడా నవ్వుతూ స్టిల్ ఇచ్చారు.

ప్రియాంక అరుల్ మోహన్ తీసిన సెల్ఫీ ఫోటో చాలా బాగుంది అంటూ వారి అభిమానులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అలాగే ప్రస్తుతం హిందీ ఫోటోలో ఉన్న నలుగురు హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. యువ నటీమణులలో సాయి పల్లవి, కళ్యాణి ప్రియదర్శన్ సీనియర్ కాగా.. రీసెంట్ గా వచ్చిన కృతి శెట్టి, ప్రియాంక అరుల మోహన్ కూడా మంచి సినిమాలతో వారి క్రేజ్ ను పెంచుకుంటున్నారు.
ఒక అవార్డ్స్ నైట్ కి హాజరైనప్పుడు ఈ సెల్ఫీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కల్యాణి ప్రియదర్శన్ చివరిగా హృదయం, బ్రో డాడీ చిత్రాలలో కనిపించింది. ఇక సాయి పల్లవి కొత్త చిత్రం గార్గి, విరాట పర్వం విడుదలకు సిద్ధమవ్వగా.. కృతి శెట్టి ద వారియర్ సినిమా కూడా బైలాంగ్యువల్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ప్రియాంక అరుల్ మోహన్ రజనీకాంత్ 169వ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.


Click it and Unblock the Notifications











