నితిన్‌తో 'చిత్రలహరి' హీరోయిన్ రొమాన్స్!

యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాదిలో మాత్రం తన చిత్రాల విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కి కూడా ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు వెంకీ కుడుముల కళ్యాణి ప్రియదర్శన్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కళ్యాణి ప్రియదర్శన్ హలొ చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది.

 Kalyani Priyadarshan To romance with Young Hero Nithiin

ఇటీవలే చిత్రలహరి చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన నటించిన సక్సెస్ అందుకుంది. చిత్రలహరిలో కళ్యాణి ప్రియదర్శన్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి. త్వరలో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కబోయే భీష్మ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X