బెడ్‌రూమ్ సీన్స్‌లో హద్దులు దాటేసి .. నువ్వు డాక్టర్‌వేనా , హీరోయిన్‌పై దారుణంగా
సినీరంగంలోకి అడుగుపెట్టిన తర్వాత నటీనటులు అన్ని రకాల పాత్రలు చేయాల్సి ఉంటుంది. నేను ఇది చేయను, నాకు సెట్ కాదంటూ కబుర్లు చెబితే ఆఫర్లు తగ్గి ఇంటికెళ్లి పోవాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్లు హద్దులు పెట్టుకుని కూర్చొంటే త్వరగా ఫేడవుట్ కావాల్సిందే. కథ, కథనం మేరకు ఖచ్చితంగా హీరోయిన్లు తమను తాము మార్చుకోవాల్సిందే. ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాల్సిందే. ఇదే విషయాన్ని చెబుతున్నారు హీరోయిన్ సాయి కామాక్షి భాస్కర్ల.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని సినీరంగంలో చాలా మంది చెబుతుంటారు. కానీ డాక్టర్ చదివి, మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు డాక్టర్ కామాక్షి భాస్కర్ల. 1995 జూన్ 18న హైదరాబాద్‌లో జన్మించారు కామాక్షి భాస్కర్ల. చైనాలో ఎంబీబీఎస్ అభ్యసించిన ఈమె .. చేతికి పట్టా వచ్చిన తర్వాత అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేశారు. అయితే చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలనే ఆసక్తి ఉండటంతో సినీనటులతో బంధుత్వం కారణంగా కామాక్షి కూడా యాక్టింగ్ వైపు అడుగులు వేశారు.

తొలుత మోడలింగ్‌లోకి దిగి.. 2018లో మిస్ తెలంగాణగా ఎంపికై అదే ఏడాది మిస్ ఇండియా కాంటెస్ట్‌లో దేశ నలుమూలల నుంచి వచ్చిన అందగత్తెలకు గట్టిపోటీ ఇచ్చి ఫైనల్ వరకు వెళ్లొచ్చారు . అనంతరం ప్రియురాలు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కామాక్షి భాస్కర్లకు మా ఊరి పొలిమేర చిత్రం బ్రేక్ తీసుకొచ్చింది. తర్వాత పొలిమేర 2, దూత, ఝాన్సీ, సైతాన్ వెబ్ సిరీస్‌లు, మారేడుమిల్లి ప్రజానీకం, విరూపక్ష, ఓం భీమ్ బుష్ సినిమాలలోనూ నటించారు.
నటిగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం తన కల అని పలుమార్లు చెప్పుకొచ్చారు కామాక్షి. కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేయడంతో పాటు స్క్రిప్ట్ విషయంలోనూ కీలకపాత్ర పోషించారు. వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్‌లను ఎంతగానో ఇష్టపడతారు కామాక్షి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కామాక్షి కాకరేపుతుంటారు.
ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న కామాక్షి భాస్కర్ల.. పొలిమేర సినిమాలో బెడ్‌రూం సీన్స్‌లో రెచ్చిపోయి నటించడంతో తనపై వచ్చిన విమర్శల గురించి ప్రస్తావించారు. గ్లామరస్ రోల్స్ చేసి నేను ఏం సాధిస్తాననే ప్రశ్న తనను వెంటాడుతూ ఉంటుందని కామాక్షి చెప్పింది. డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేయాలని అనుకుంటానని .. పొలిమేరలో ఇంటిమేట్ సీన్స్ చేసినప్పుడు , మీరు డాక్టర్ అయ్యుండి ఎందుకు చేశారని తనపై ట్రోలింగ్ జరిగిందని ఆమె వెల్లడించారు.
రెండు వేరు వేరు రంగాలని.. ఇందులో నా క్రాఫ్ట్ ఏంటో నాకు తెలుసని, పొలిమేర 2లో లక్ష్మీ క్యారెక్టర్ థియేటర్‌లో అందరినీ కూర్చోబెట్టిందని కామాక్షి తెలిపారు. కథ, కథనం మేరకే నా రోల్స్ ఉన్నాయని.. ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా నటించాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం కామాక్షి భాస్కర్ల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











