‘4 ఏళ్ల వయసులోనే లైంగిక వేధింపులు... ఆ కోరికలు చచ్చిపోయాయి’

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలామంది సినీనటులు చిత్రసీమలో చెబుతుంటారు. కానీ డాక్టర్ చదివి ఆ తర్వాత యాక్టర్ అయినవాళ్లు కూడా ఉన్నారు. డాక్టర్ రాజశేఖర్, సాయిపల్లవి, మీనాక్షి చౌదరి, శివానీ రాజశేఖర్, ఐశ్వర్య లక్ష్మీ, అదితి శంకర్, ఆకాంక్ష సింగ్ తదితరులు ఎంబీబీఎస్ చదివి అనంతరం సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ కోవలోకే వస్తారు కామాక్షి భాస్కర్ల. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈ ముద్దుగుమ్మ.. చైనాలో ఎంబీబీఎస్ చదివి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా సేవలందించారు. అయితే సినిమాలపై ఇష్టంతో డాక్టర్ కెరీర్‌ను పక్కనపెట్టి మోడలింగ్ వైపు వచ్చారు.

2018లో మిస్ తెలంగాణగా కిరీటాన్ని గెలుచుకున్నారు. అదే ఏడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లింది కామాక్షి. ఆపై సినీరంగంలో అడుగుపెట్టిన ఆమె.. ప్రియురాలు మూవీతో ప్రేక్షకులను పలకరించారు. అయితే సత్యం రాజేష్‌కు జోడీగా ఆమె నటించిన మా ఊరి పొలిమేరతో కామాక్షికి యువతలో క్రేజ్ వచ్చింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, రౌడీ బాయ్స్, విరూపక్ష, పొలిమేర 2, మిక్స్‌అప్, ఓం భీం బుష్, లైలా, షో టైం, 12ఏ రైల్వే కాలనీ, మ్యాన్షన్ హౌస్ మల్లేష్, డెకాయిట్ ఏ లవ్ స్టోరీ సినిమాలలో మీనాక్షి నటించారు. ప్రస్తుతం మా ఊరి పొలిమేర 3లో ఆమె నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు, వ్యక్తిగత జీవితం, బ్రేకప్స్ గురించి కీలక విషయాలు పంచుకున్నారు కామాక్షి భాస్కర్ల.

Kamakshi Bhaskarla Opens Up About Breakups Relationships and Personal Trauma

నాకు 20-25 ఏళ్ల వయసులో నాకు అలాంటివాళ్లు కావాలి.. ఇలాంటి వాళ్లు కావాలి అనిపించేది. అయితే 30లలో ప్రవేశించేసరికి మనకి ఏం కావాలో కాదు.. అవతలి మనిషికి కూడా మనలాగే రిక్వైర్‌మెంట్స్ ఉంటాయి. ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని. మనం వాళ్ల కోసం కూడా ఆలోచించాలి కదా? మనకి ఏం కావాలి అనేది సెల్ఫిస్‌నెస్.. వాళ్లకి కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఒక పర్సన్ ఇలా ఉంటే రిలేషన్‌షిప్‌లో వర్కవుట్ అవుతుంది. కమ్యునికేషన్స్‌లో ఇంప్రూవ్ అవ్వడం కానీ.. మనం వర్క్ చేయకుండా ఒక రిలేషన్‌లోకి వెళితే అది ఎప్పటికీ నిలబడదని నా ఫెయిల్డ్ రిలేషన్‌షిప్ గురించి నేను నేర్చుకున్నానని కామాక్షి భాస్కర్ల తెలిపారు.

నేను కూడా మనిషినే.. అన్ని చోట్లా ఒక్క దానినే కనిపిస్తానని మీరు అంటూ ఉంటారు? వెనుక ఎవరూ రారు అని అడుగుతుంటారు. ఎవరూ లేరు కాబట్టే ఎవరూ రావడం లేదు. నాకు 3 బ్రేకప్స్ అయ్యాయి.. అవన్నీ కూడా పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఇద్దరం కలిసి ఓ రిలేషన్‌లో ఉండాలంటే.. ఇద్దరి గురించి ఆలోచించాల్సిందే. నేను నా గురించి ఆలోచించుకుని, అవతలి వ్యక్తి అతని గురించి ఆలోచించుకుంటే అది రిలేషన్ అవ్వదు. సిద్ధాంతపరంగా నచ్చకపోవడం వల్లే నాకు బ్రేకప్స్ అయ్యాయిని కామాక్షి అన్నారు.

ఫిజికల్ ఎక్స్‌చేంజ్ ఏం ఉండదు కదా అని యాంకర్ అడగ్గా.. షేక్ హ్యాండ్ నుంచి సెక్స్ వరకు అన్నీ ఫిజికల్ ఎక్స్‌చేంజ్‌లే. షేక్ హ్యాండ్ మన ఎనర్జీలను కూడా ఎక్స్‌చేంజ్ చేస్తుంది. సెక్స్ వరకు వస్తే దానిని ఏదో బూతులాగా చూస్తారో నాకు అర్ధం కావడం లేదు. మనసులోని ఆలోచనలు చాలా గొప్పవి అలాంటివే ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నప్పుడు సెక్స్‌కి పరిమితులు ఎందుకు. ఈ విషయాలపై కోర్టులలో కూడా గొడవలు జరిగాయి. ఖుష్బూ గారి మీద చెప్పులు విసిరారు. నీ సోల్‌నే నువ్వు ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటున్నప్పుడు ఫిజికల్‌ అనేదానిని మాత్రం బూతు అనడం ఎంత వరకు కరెక్ట్ కాదు. నా విషయంలో ఫిజికల్ ఎక్స్‌ఛేంజ్ అనేది గొప్పది కాదని కామాక్షి వెల్లడించారు.

అందరూ నాలాగా ఆలోచించాలని కాదు కానీ.. 4 ఏళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులకు గురయ్యా.. టీనేజ్‌లో కూడా మూడేళ్ల పాటు వేధింపులను ఎదుర్కొన్నా. ఇలాంటి పరిస్ధితులను ఎదుర్కొన్న అమ్మాయికి బాడీ మీద ఎలాంటి మొహం ఉంటుంది. నేను ఒక ఎన్జీవోలో చేరడానికి ముందు వరకు నా ఒక్కదానికే ఇలా అయ్యింది. నా జీవితమే ఎందుకు ఇలా అయ్యిందని బాధపడేదానిని.. కానీ నేను కొందరు అమ్మాయిలను కలిసిన తర్వాత వాళ్లు చెప్పిన ఘటనలు, వాళ్లు ఎదుర్కొన్న పరిస్ధితులను మనం ఊహించలేం. ఊళ్లలో స్త్రీల స్థితి, గతి, పరిస్ధితి చాలా దారుణంగా ఉన్నాయి. నేను అక్కడికి వెళ్లి మాట్లాడి, దగ్గరుండి చూశాను. ఇది నా జనరేషన్‌లోనే కాదు.. అమ్మ, అమ్మమ్మ అంతకంటే ముందు నుంచి ఇలాంటి ఉన్నాయి అని కామాక్షి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X