Sai Kamakshi Bhaskarla : పైటను అలా గాలికొదిలేసి .. చుక్కల చీరలో కవ్విస్తోన్న డాక్టరమ్మ

మన చిత్ర పరిశ్రమలో స్టార్లు ఉన్న వారిని కదిలిస్తే చాలా మంది తాము యాక్టర్ కావాలని కలలు గన్నామని కానీ.. విధి తమను సినీ పరిశ్రమ వైపు నడిపించిందని చెబుతారు. కానీ ఇంకొందరు మాత్రం ఆల్రెడీ డాక్టర్లుగా ప్రాక్టీస్‌‌ను వదులుకుని సినీరంగం వైపు వచ్చిన వారు ఉన్నారు. సాయిపల్లవి, మీనాక్షి చౌదరి, శివానీ రాజశేఖర్, ఐశ్వర్య లక్ష్మీ, అదితి శంకర్, ఆకాంక్ష సింగ్ తదితరులు మెడిసిన్ పూర్తి చేసినవారే. ఈ కోవలోకే వస్తారు డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్ల.

చైనాలో ఎంబీబీఎస్ చేసి అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా సేవలందించారు. తర్వాత మోడలింగ్ వైపు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 2018లో మిస్ తెలంగాణగా ఎంపికైంది. అదే ఏడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లారు కామాక్షి. అనంతరం సినీరంగంలో అడుగుపెట్టిన ఆమె.. ప్రియురాలు మూవీతో తెలుగు తెరకి పరిచయమయ్యారు . కానీ ఆ సినిమా వచ్చినట్లు, వెళ్లినట్లు కూడా తెలియదు. అయితే సత్యం రాజేష్‌కు జోడీగా ఆమె నటించిన మా ఊరి పొలిమేరతో కామాక్షికి యువతలో క్రేజ్ వచ్చింది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన కామాక్షి కెరీర్‌ను ఈ సినిమా మలుపు తిప్పింది.

కోవిడ్ కారణంగా మా ఊరి పొలిమేర ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇందులో బాధ్యత గల ఇల్లాలిగానూ, బెడ్‌రూమ్ సీన్లలోనూ ఇరగదీసి నటించి కుర్రాళ్లను రెచ్చగొట్టింది కామాక్షి. ఆ సినిమాకు సీక్వెల్‌గా పొలిమేర 2 తీశారు దర్శకుడు విశ్వనాథ్. ఈ సినిమాలో కేవలం నటిగానే కాకుండా దర్శకత్వం, రచనా విభాగంలోనూ పనిచేసి సత్తా చాటారు కామాక్షి. ఈ సినిమాకు డైలాగ్స్ రాయడంతో పాటు కథ తయారు చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు. మొత్తంగా పొలిమేర 2కి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు కామాక్షి.

ఈ సినిమా తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన దూత వెబ్ సిరీస్‌లోనూ కామాక్షి కీలక పాత్ర పోషించారు. గ్లామర్ , డీ గ్లామర్ రోల్సే కాదు .. అన్ని రకాల ఛాలెంజింగ్ పాత్రలు చేయాలని ఉందని ఆమె పలు వేదికలపై చెప్పారు. ఎప్పటికైనా డైరెక్టర్‌గానూ మెగా ఫోన్ పడతానంటున్న కామాక్షి.. ఇందుకు సంబంధించిన అంశాలపై పట్టు సాధిస్తున్నారు.

Kamakshi Bhaskarla PhotoShoot with saree Her latest photos here

మా ఊరి పొలిమేర తర్వాత ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం, విరూపక్ష, ఓం భీమ్ బుష్ వంటి సినిమాలతో పాటు ఝాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్‌లలోనూ కనిపించారు. అందాలు ఆరబోయడంతో పాటు అవసరమైతే సీరియస్ రోల్స్‌లోనూ చితక్కొట్టగలనని కామాక్షి నిరూపించారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కామాక్షి .. తన వ్యక్తిగత విషయాలు, సినిమా సంగతులను పంచుకుంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. తాజాగా చుక్కల రంగు చీర కట్టి దానికి మ్యాచింగ్‌గా రెడ్ కలర్ బ్లౌజ్ వేసి పైటను గాలికి వదిలేస్తూ , బ్యాక్ అందాలను చూపిస్తూ చేసిన ఫోటో షూట్‌ను కామాక్షి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం కామాక్షి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: kamakshi bhaskarla movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X