Kamakshi Bhaskarla : బెడ్‌పై ఆ యాంగిల్‌లో ఫోజులు .. అందాల పొలిమేర తెంచేసిన డాక్టరమ్మ!
డాక్టర్ అవ్వబోయి యాక్టర్లు అయిన నటీనటులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. కానీ డాక్టర్లుగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత కూడా కొందరు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి, మీనాక్షి చౌదరి, శివానీ రాజశేఖర్, ఐశ్వర్య లక్ష్మీ, అదితి శంకర్, ఆకాంక్ష సింగ్ తదితరులు మెడిసిన్ పూర్తి చేసినవారే. ఈ కోవలోకే వస్తారు డాక్టర్ కామాక్షి భాస్కర్ల. డాక్టర్ కాబట్టి ఈమె క్లాస్ అనుకుంటే పోరపాటే.. ఊరనాటే.
ప్రియురాలు సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు డాక్టర్ కామాక్షి భాస్కర్ల. కానీ ఆ సినిమా వచ్చినట్లు, వెళ్లినట్లు కూడా తెలియదు. కామాక్షి భాస్కర్ల చైనాలో ఎంబీబీఎస్ చేసి అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా సేవలందించారు. తర్వాత మోడలింగ్ వైపు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 2018లో మిస్ తెలంగాణగా ఎంపికైంది. అదే ఏడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లారు కామాక్షి. అయితే సత్యం రాజేష్ హీరోగా నటించిన మా ఊరి పొలిమేరతో ఈమెకు క్రేజ్ వచ్చింది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన కామాక్షి కెరీర్‌ను ఈ సినిమా మలుపు తిప్పింది.

కోవిడ్ కారణంగా మా ఊరి పొలిమేర ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇందులో సత్యం రాజేష్‌తో బెడ్‌రూమ్ సీన్‌లో నటించి కుర్రాళ్లను రెచ్చగొట్టింది కామాక్షి. ఆ సినిమాకు సీక్వెల్‌గా పొలిమేర 2 తీశారు దర్శకుడు విశ్వనాథ్. ఈ సినిమాలో కేవలం నటిగానే కాకుండా దర్శకత్వం, రచనా విభాగంలోనూ పనిచేశారు. సెకండ్ పార్ట్‌లో కొన్ని మాటలు రాయడంతో పాటు కథ తయారు చేయడంలోనూ ఓ చేయి వేశారు. మొత్తంగా పొలిమేర 2కి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు కామాక్షి.
తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన దూత వెబ్ సిరీస్‌లోనూ కామాక్షి కీలక పాత్ర పోషించారు. దూతలోనూ పొలిమేర ఛాయలు కనిపిస్తాయి. అయినప్పటికీ డిఫరెంట్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు కామాక్షి. తనకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని ఈమె పలుమార్లు వేదికలపై చెప్పారు. దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకుంటున్న కామాక్షి భాస్కర్ల త్వరలో మెగా ఫోన్ పట్టే అవకాశం కూడా లేకపోలేదు.
మా ఊరి పొలిమేర సక్సెస్ తర్వాత విరూపాక్ష, మంగళవారం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమాల్లో నటించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కామాక్షి .. తన వ్యక్తిగత విషయాలు, సినిమా సంగతులను పంచుకుంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. తాజాగా టాప్ లెస్ అందాలతో బెడ్‌పై వెల్లకిలా పడుకుని దిగిన ఫోటోను కామాక్షి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











