‘ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఉండాలంటే.. అలా చేయాల్సిందే.. ’

Kamakshi Bhaskarla: టాలెంటెడ్ నటి కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పొలిమేర సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆమె తన సహజ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ విజయాన్ని కొనసాగిస్తూ సీక్వెల్ పొలిమేర 2లో కూడా నటించి, దాదా సాహెబ్ ఫాల్కే 2024 జ్యూరీ అవార్డు అందుకుంది. ఆ తర్వాత కూడా ఈ బ్యూటీ వేర్వేరు జానర్స్‌లో పలు మంచి సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అయితే.. కొన్ని కండీషన్స్ పాటించాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తున్న తాజా సినిమా "12ఎ రైల్వే కాలనీ". అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను డెబ్యూ దర్శకుడు నాని కసరగడ్డ తెరకెక్కిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.ఈ సినిమా నవంబర్ 21న (నేడు) విడుదలైంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి ఆసక్తికరంగా మాట్లాడారు.

Kamakshi Bhaskarla Reveals Shocking Industry Conditions for Heroines in 12A Railway Colony Pre-Release Event

కామాక్షి మాట్లాడుతూ.. తాను అసలు ఒక డాక్టర్ అని, నటనపై ఉన్న ప్యాషన్ వల్ల మోడలింగ్‌కు వచ్చి, అక్కడి నుంచి సినిమాల దారిని ఎంచుకున్నానని తెలిపారు. "మోడలింగ్ చేస్తూనే సమయం దొరికినప్పుడల్లా ఆడిషన్లకు వెళ్లేదాన్ని. అవకాశాల కోసం నేను చాలానే ప్రయత్నాలు చేశా. అలా ప్రయత్నాలు చేస్తూనే 'పొలిమేర' సినిమాలో నటించే అవకాశం దక్కింది" అని ఆమె గుర్తుచేసుకున్నారు. పొలిమేర సినిమా బడ్జెట్ కేవలం 80 లక్షలే అయినప్పటికీ, ఆ చిత్రంలో హీరోయిన్ గానే కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా పనిచేయడం తన అదృష్టమని ఆమె చెప్పింది.

"తెరపై కనిపించే కష్టాల కన్నా తెరవెనుక కష్టాలు ఎక్కువ. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ 'ఇండస్ట్రీలోనే ఉండాలి' అని నేను నన్ను నేను ఫిక్స్ చేసుకున్నా. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ సపోర్టుతోనే ఇంతవరకు ప్రయాణిస్తున్నాను" అని కామాక్షి చెప్పింది.

"నేను ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, గాడ్‌ఫాదర్ లేకుండా పరిశ్రమలో అడుగు పెట్టాను. అలాంటి నాకు మంచి ప్లాట్‌ఫామ్ ఇచ్చింది అనిల్ విశ్వనాథ్ గారు. ఆయన వల్లనే నాకు రాజమౌళి, సుకుమార్ వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి" అని చెప్పింది. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిత్తూరుపై కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే ఫిక్స్ చేసిన లుక్, ఫిక్స్ చేసిన డ్రెస్సింగ్ అనే ఒక అప్రకటిత నియమం ఉన్నట్టు కామాక్షి చెప్పారు. "హీరోయిన్స్ ఇలా ఉండాలి, అలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలా మాట్లాడాలి అనే కండిషన్లు ఇక్కడ చాలా ఏళ్లుగా ఉన్నాయి. నేను ఆ కట్టుబాట్లను బ్రేక్ చేయాలనుకుంటున్నాను. వాస్తవానికి నేను అలాంటి కండిషన్లకు ఫిట్ కానని ముందే అర్థమైంది. అందుకే సవాలుగా తీసుకుని వాటిని చెదరగొట్టాలనుకున్నాను. ఇది ఈజీ కాదని నాకు తెలుసు, కానీ అలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమే" అని ధైర్యంగా ప్రకటించింది.

తరువాత లేటెస్ట్ మూవీ గురించి మాట్లాడుతూ "ఇది ఒక ఆసక్తికరమైన సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో నేను 'ఆరాధన' అనే కీలక పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర సినిమా మొత్తం నడిపే స్థాయిలో ఉంటుంది. చాలా మంది హీరోలు కొత్తరకం పాత్రలు చేస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. అలాగా హీరోయిన్స్ కూడా ఎందుకు చేయకూడదు అని నేను నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఈ పాత్ర అలాంటి సవాల్‌గానే తీసుకున్నాను" అని కామాక్షి వివరించింది. ప్రస్తుతం హీరోయిన్ కామాక్షి కామెంట్స్ నెట్టింట్లో వైరలవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X