డోస్ పెంచిన పొలిమేర భామ .. మెట్లపై అలాంటి ఫోజులతో గ్లామర్ ట్రీట్!
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వారికి భిన్నంగా .. మెడిసిన్ చదివి ముఖానికి రంగేసుకున్నారు డాక్టర్ కామాక్షి భాస్కర్ల. పొలిమేర చిత్రంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ తన అందం, చలాకీతనంతో ఆకట్టుకుంటున్నారు. నటనతో పాటు ఇతర విషయాల్లోనూ ముందుండే కామాక్షి భాస్కర్ల తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
1995 జూన్ 18న హైదరాబాద్‌లో జన్మించారు కామాక్షి భాస్కర్ల. ఈమెకు చిన్నతనం నుంచి డాక్టర్ కావాలని కోరిక.. తన ఆశయం నెరవేర్చుకునేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఏ ప్రాంతానికి వెళ్లినా కొత్త వంటకాలు రుచి చూడటం అలవాటు కావడంతో చైనాలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రజల ఆహారపు అలవాట్లు ఆమెకు ఆశ్చర్యంగా అనిపించాయి. చైనీయులు బొద్దింకలు, తేళ్లు , పాములు ఇలా ఏది దొరికితే అది తింటారన్న సంగతి తెలిసిందే.

దీంతో కామాక్షి కూడా ఆ ఆహారం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒకసారి రుచి చేశారట. అయితే రూమ్‌లో తానే వంట చేసుకుని తిన్నానని ఆరేళ్ల పాటు తన దినచర్య అదేనని కామాక్షి భాస్కర్ల తెలిపారు. అంతేకాదు.. చైనీయులు ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి ఇష్టపడరని , దీంతో తాను మొదట్లో చాలా ఇబ్బందులు పడినట్లు కామాక్షి చెప్పింది. అయితే నెమ్మదిగా తాను కూడా మాండరీన్ నేర్చుకున్నానని ఈ డాక్టరమ్మ చెప్పారు.
మెడిసిన్ పట్టా అందుకున్నాక అపోలో ఆసుపత్రిలో కొన్నాళ్లు డాక్టర్‌గా పనిచేసి ఆపై మోడలింగ్ వైపు అడుగులు వేశారు కామాక్షి. 2018లో మిస్ తెలంగాణగా ఎంపికై అదే ఏడాది మిస్ ఇండియా కాంటెస్ట్‌లో హేమాహేమీలను తట్టుకుని ఫైనల్ వరకు వెళ్లొచ్చారు . అనంతరం ప్రియురాలు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. మా ఊరి పొలిమేర చిత్రం కామాక్షికి బ్రేక్‌తో పాటు తెలుగునాట మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇందులో నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో పాటు రొమాంటిక్ సీన్స్‌లోనూ హద్దులు దాటి నటించింది కామాక్షి.
తర్వాత పొలిమేర 2, దూత, ఝాన్సీ, సైతాన్ వెబ్ సిరీస్‌లు, మారేడుమిల్లి ప్రజానీకం, విరూపక్ష, ఓం భీమ్ బుష్ సినిమాలలోనూ నటించారు. అన్నీ కుదిరితే మెగా ఫోన్ పట్టి డైరెక్టర్ కావాలనేది తన కల అని కామాక్షి పలు సందర్భాల్లో తెలియజేశారు. పొలిమేర 2 సినిమా సమయంలో నటనతో పాటు డైరెక్షన్, స్క్రిప్ట్ విషయంలోనూ కామాక్షి కీలకపాత్ర పోషించారట. ఈమె దూకుడు చూడబోతే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరో మహిళా దర్శకురాలు త్వరలోనే ఎంట్రీ ఇచ్చేలా ఉంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే డాక్టర్ కామాక్షి భాస్కర్ల ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, తన వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా మెట్లపై ఆమె చేసిన రొమాంటిక్ ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం కామాక్షి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











