‘ఆ కోరిక తీర్చమని అడిగా.. కమల్ హాసన్ నో చెప్పాడు’

దక్షిణాదిలో టాలెంటెడ్ నటి అభిరామి తన రెండో ఇన్నింగ్స్‌ను ఘనంగా కొనసాగిస్తున్నది. హీరోయిన్‌గా మంచి పొజిషన్‌లో ఉంటూ స్టార్‌గా రాణిస్తూ అర్ధాంతరంగా కొంత విరామం తీసుకొన్నారు. అయితే యాక్టింగ్ నుంచి కొంతకాలం తప్పుకొనేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా విలక్షణ నటుడు కమల్ హాసన్‌ను ఓ కోరిక కోరగా అందుకు నిరాకరించారని ఆమె వెల్లడించారు. ఆమె కోరిన కోరిక ఏమిటి? కమల్ దానిని ఎందుకు నిరాకరించారనే వివరాల్లోకి వెళితే..

తమిళంలో కమల్ హాసన్‌తో వైరుమండి సినిమాలో అభిరామి నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగు జరుగుతుండగానే ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన నిర్ణయం తీసుకొన్నారు. యాక్టింగ్‌కు కొంత బ్రేక్ ఇచ్చి స్టడీస్‌పై దృష్టిపెట్టాలని నిర్ణయించుకొన్నారు. ఓహియోలోని ఉస్టర్ యూనివర్సిటీలో సైకాలజీ అండ్ కమ్యూనికేషన్ కోర్సు కోసం అప్లై చేశారు.

Kamal Haasan rejected Abhirami for request at Virumaandi Shoot

అయితే విదేశీ యూనివర్సిటీలో చదువుకోవాలంటే.. ఇద్దరు సినీ ప్రముఖుల రికమండేషన్ కావాల్సి వచ్చింది. అయితే ప్రముఖ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్‌ను కోరగా ఆయన తన వంతుగా రికమండేషన్ లెటర్ ఇచ్చారు. ఇక రెండో లెటర్ కావాల్సి రావడంతో ఎవరిని అడగాలని ఆలోచించారు. చివరకు ధైర్యం చేసి కమల్ హాసన్‌ను అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది.

తాను విదేశీ యూనివర్సిటీలో చదువుకొనేందుకు రికమండేషన్ లెటర్ కావాలి. మీరు ఇవ్వగలరా? అని అడిగితే.. నేను నీకు ఆ లెటర్ ఇవ్వలేను. ఎందుకంటే.. నీలాంటి టాలెంటెడ్ నటి ఇండస్ట్రీని వదిలిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నీకు ఆ రికమండేషన్ లెటర్ ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిరామి వెల్లడించారు. అయితే ఆమె నిరుత్సాహ పడకుండా వైరమండి సినిమాను పూర్తి చేసి అమెరికాకు వెళ్లిపోయారు.

అభిరామి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. రజనీకాంత్ నటించిన వెట్టియాన్ సినిమాలో ఆమె కీలక పాత్రను పోషించి మెప్పించారు. అలాగే మారా చిత్రంలో కూడా నటించారు. అలాగే ఓ తెలుగు సినిమాలో కూడా పవర్‌ఫుల్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.

More from Filmibeat

Read more about: kamal haasan abhirami virumaandi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X