twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కమల్ హీరోయిన్!

    |

    విలక్షణ నటుడు కమల్ హాసన్ రూపొందించిన విశ్వరూపం చిత్రంలో నటించడం ద్వారా హీరోయిన్‌గా దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత కమల్ హాసన్‌తో కలిసి వరుసగా సినిమాల్లో నించారు. అలా స్టార్ హీరోయిన్‌గా మారిన పూజా కుమార్ తన అభిమానులకు శుభవార్తను అందించారు. పూజా కుమార్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా పూజా కుమార్ గురించి మరిన్నీ విషయాలు...

    అందాల చిన్నది.. జాన్వీ కపూర్ పిక్స్ వైరల్

    అమెరికాలో మిస్ ఇండియాగా

    అమెరికాలో మిస్ ఇండియాగా

    మిస్ ఇండియా యూఎస్ఏగా పూజా కుమార్ ఎన్నికైన తర్వాత 2000 సంవత్సరంలో కాదల్ రోజావే చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2013లో విశ్వరూపం చిత్రం ద్వారా మరింత పాపులారిటీని సంపాదించారు. ఆ తర్వాత విశ్వరూపం 2, ఉత్తమ విలన్ చిత్రాల్లో కమల్‌తో కలిసి నటించారు.

    వెడ్డింగ్ ప్లానర్‌తో ప్రేమ.. పెళ్లి

    వెడ్డింగ్ ప్లానర్‌తో ప్రేమ.. పెళ్లి

    హీరోయిన్‌గా మంచి అవకాశాలు అందుకొంటున్న సమయంలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన పూజా జాయ్ అనే వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ అధినేత విశాల్ జోషిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకొన్నారు. ప్రస్తుతం పూజాకుమార్ దంపతులు తమకు ఆడపిల్ల జన్మించిందని బాహ్య ప్రపంచానికి వెల్లడించారు.

    నా పండంటి బిడ్డను పరిచయం చేయడానికి

    నా పండంటి బిడ్డను పరిచయం చేయడానికి

    తమకు ఆడపిల్ల జన్మించిందని పూజా కుమార్ భర్త విశాల్ జోషి తమ ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వరకు మేము ఇద్దరం. మా కుటుంబంలో మేమిప్పుడు ముగ్గురం. మా జీవితంలోకి అడుగుపెట్టిన చిన్నారి నవ్య జోషిని మీకు పరిచయం చేయడానికి ఎక్సైటింగ్‌గా ఉన్నాం. నా జీవితంలో అద్భుత సహచరిగా నాకు పండంటి బిడ్డను ప్రసాదించిన పూజా కుమార్‌కు థ్యాంక్స్ అంటూ విశాల్ జోషి తెలిపారు.

     నా జీవితంలో కొత్త అనుభూతులను మిగిల్చావు

    నా జీవితంలో కొత్త అనుభూతులను మిగిల్చావు

    నాకు పండంటి బిడ్డను ప్రసాదించి నా బర్త్ డేను మరిచిపోలేని విధంగా మార్చేశావు. నా జీవితంలో కొత్త అనుభూతులను మిగిల్చావు. అందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ పూజా కుమార్‌పై విశాల్ జోషి తన ప్రేమను కురిపించారు. మా చిన్న కుటుంబాన్ని అద్భుతంగా ఫోటోలో బంధించిన ఫోటోగ్రాఫర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

    హాలీవుడ్ చిత్రాల్లో పూజా కుమార్

    హాలీవుడ్ చిత్రాల్లో పూజా కుమార్

    అమెరికాలో పలు సినిమాల్లో నటిస్తూనే కొన్ని చిత్రాలకు నిర్మాతగా మారారు. 1001 ఆడిషన్స్‌ అనే షార్ట్ ఫిలింతోపాటు.. షూట్ మై లైఫ్ అనే చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేశారు. అలాగే హాలీవుడ్‌లో మ్యాన్ ఆన్ ఏ లెడ్జ్ అండ్ బ్రాల్ ఇన్ సెల్ బ్లాక్ 99 అనే చిత్రాల్లో నటించారు.

    నవ్వులు చిందిస్తూ కంటపడ్డ కరిష్మీ తన్నా

    English summary
    Star Heroine Kamal Haasan's heroine Pooja Kumar blessed with Baby Naavya Joshi. Pooja Kumar husband Vishal Joshi wrote in instagram that Once upon a time we were two and now we are three 🥰. Pooja and I are so excited to introduce you all to our little baby girl Naavya Joshi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X