నాపై 6 కేసులు ఎందుకు? నన్ను జైల్లో పెట్టాలని కుట్ర చేశారు.. బాలీవుడ్ మాఫియాపై కంగన ఆగ్రహం

సుశాంత్ సింగ్ మరణాన్ని మరో విధంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న బాలీవుఢ్ ప్రముఖులపై ఫైర్ బ్రాండ్ యాక్టర్ కంగన రనౌత్ భగ్గుమన్నారు. తాము చేసిన చేసిన పనులను కప్పిపుచ్చుకోవడానికి ఇండస్ట్రీలోని ఓవర్గం మీడియాను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్‌ మరణంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగు నిమిషాల వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ..

స్టార్ల పిల్లలకే భవిష్యత్తా?

స్టార్ల పిల్లలకే భవిష్యత్తా?

బాలీవుడ్‌లో స్టార్ హీరోల పిల్లలకే భవిష్యత్తు ఉండాలా? ఇండస్ట్రీలో రాణించాలని బయట నుంచి వచ్చే ప్రతిభావంతులు పనికిరారా అంటూ కంగన రనౌత్ అగ్రహం వ్యక్తం చేశారు. బంధుప్రీతి, తమ వాళ్లకే అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలు సరికావు. ఇలా ఆలోచించే కొందరు వ్యక్తులు ఎలైట్ కల్బ్ గ్రూప్ ఆఫ్ బాలీవుడ్ లేదా బాలీవుడ్ మాఫియాగా చెలామణి అవుతున్నారు అంటూ గతంలో కరణ్ జోహర్ షోలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

నన్ను తొక్కేయాలని ప్రయత్నించారు

నన్ను తొక్కేయాలని ప్రయత్నించారు

ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చిన తనను కూడా తొక్కేయాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ వారి వల్ల ఏమీ కాలేదు. నా ప్రతిభతో నేను నిలబడ్డాను. నటిగా, డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాను. గతంలో నాపై చాలానే కుట్రలు జరిగాయి.అయినా వాటిని నేను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాను అని కంగన చెప్పారు.

నన్ను జైల్లో పెట్టాలని ఎందుకు చూశారు?

నన్ను జైల్లో పెట్టాలని ఎందుకు చూశారు?

సుశాంత్ సింగ్ మరణం నేపథ్యంలో మాకు మీ సినిమాలు అవసరం లేదు. మీ నుంచి ఏమి ఆశించడం లేదు. కానీ మేము సినిమాలు తీస్తే వాటిని గుర్తించండి. ప్రశంసించండి. నేను డైరెక్టర్‌ను. నేను తీసిన సూపర్‌ హిట్ సినిమాలు ఫ్లాప్ అని ఎందుకు ప్రచారం చేస్తారు. నాపై ఆరు కేసులు ఎందుకు పెట్టారు. నన్ను జైలులో పెట్టేందుకు ప్రయత్నించారో చెప్పాలి అని కంగన డిమాండ్ చేశారు.

Recommended Video

Star Heros Special Target On Dussehra Holidays
కొందరి కుట్రలకు సుశాంత్ బలయ్యాడు

కొందరి కుట్రలకు సుశాంత్ బలయ్యాడు

సుశాంత్ కూడా తప్పు చేశారు. ప్రతిభావంతుడివి కాదనే కొందరి చెప్పిన వాదనలను సుశాంత్ గుడ్డిగా నమ్మాడు. ఇలాంటి కష్టకాలంలో నీవు ఏమీ చేయలేవు అనే తల్లి మాటలు ఆయనపై ప్రభావం చూపాయి. చివరకు కొందరు సుశాంత్ బలహీన మనస్తత్వం కలవాడు అనే చరిత్రను రాయాలనే ఉద్దేశంతో చేసిన కుట్రకు ఆయన బలయ్యాడు అంటూ కంగన రనౌత్ ఆవేదన వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X