సుశాంత్ సూసైడ్‌కు ఆ గ్యాంగే కారణం.. పెళ్లి చెడగొట్టారు, మానసికంగా చంపేస్తారు.. కంగన ఫైర్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడ్డారు. యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా బెదిరింపులును, బాలీవుడ్ గ్యాంగుల మోసాలను, దాడులను ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్యాంగుల ఎటాక్ చేయడం వల్లే సుశాంత్ సింగ్ మానసికంగా దెబ్బ తిని ఉంటారు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకొని విషాదంగా జీవితాన్ని ముగించాడు అనే అనుమానాలను కంగన వ్యక్తం చేశారు. కంగన తనకు ఎదురైన విషయాలను వెల్లడిస్తూ..

Recommended Video

Nepotism : Nepo Kids పై ఆ వార్తలు రాసే దమ్ము మీకుందా ? : Kangana Ranaut
చాలా మంది బెదిరించారు...

చాలా మంది బెదిరించారు...

నా కెరీర్‌ను నాశనం చేయాలని బాలీవుడ్‌లో చాలా శక్తులు ప్రయత్నించాయి. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆదిత్య చోప్రా చెప్పిన విషయాలను వినకుండా ప్రశ్నించినందుకు నాపై బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఇక జన్మలో నా సినిమాల్లో నీవు ఉండవు అని చెప్పారు. ఇలాంటి బెదిరింపులు చాలా మంది నుంచి ఎదుర్కొన్నాను. అయినా ఏ క్షణంలో కూడా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు అని కంగన రనౌత్ చెప్పారు.

దాడి జరిగిన ప్రతీసారి జీవితం ఏమౌతుందేనే

దాడి జరిగిన ప్రతీసారి జీవితం ఏమౌతుందేనే

ఇండస్ట్రీలో చాలా గ్యాంగులు నాపై రకరకాల దాడికి ప్రయత్నించాయి. అలా దాడులు జరిగిన ప్రతీసారి నా జీవితం ఏమై పోతుందనే టెన్షన్ మొదలయ్యేది. ఒకరి జీవితాన్ని శాసించే అధికారం, హక్కు వారికి ఉందా? ఇండస్ట్రీలో పాతుకుపోయినందున ఇతరులపై మానసికంగా, వ్యక్తిగతం దాడి చేసే అధికారం ఎవరిచ్చారు. ఇక నీకు జీవితం లేదనే ధైర్యం వారికి ఎక్కడిది? ఏ అండతో వారు ఇలా అందర్నీ వేధిస్తారు? అని కంగన ప్రశ్నల వర్షం కురిపించారు.

మానసికంగా చంపేస్తారు..

మానసికంగా చంపేస్తారు..

నా వ్యక్తిగత జీవితాన్ని భ్రష్టు పట్టించారు. నా ప్రొఫెషనల్ జీవితాన్ని నాశనం చేసేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలో మానసికంగా, ప్రొఫెషనల్‌గా బలంగా కనిపిస్తే వారంతా ఆత్మనూన్యత భావంతో భయపడుతారు. అందుకే మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తారు. గతంలో ఓ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అతడిని బెదిరించి పారిపోయేలా చేశారు. నా కెరీర్‌పై నాకే నమ్మకం లేకపోవడం వల్ల నా వ్యక్తిగత జీవితాన్ని వదులుకొన్నాను అని కంగన ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇండస్ట్రీలో మైండ్ గేమ్

ఇండస్ట్రీలో మైండ్ గేమ్

నేను ఎవరితో పనిచేయాలన్నది నా పరిధిలోని విషయం. మరో వ్యక్తి ఆ మాటను ఎలా అంటారు. మీడియాలో అలాంటి విషయాలను వెల్లడించి భావితరానికి ఏం చెప్పాలనుకొంటారు. చాలా గ్యాంగులు ఇండస్ట్రీలో మైండ్ గేమ్స్ ఆడుతాయి. ఇలాంటి అధికారాన్ని, అహంకారాన్ని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. వారు చేసిన అన్యాయాలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది అంటూ కంగన ఆగ్రహం వ్యక్తం చేసింది.

నేను ఎవరికీ భయపడను..

నేను ఎవరికీ భయపడను..

నిన్న సుశాంత్, గతంలో చాలా మంది ఇలాంటి దురాగతాలకు బలయ్యారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది. ఇక నుంచి ఎలాంటి వారినైనా, ఎలాంటి పరిస్థితినైనా ఎదురించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎంతవరకు వెళ్లేందుకైనా రెడీగా ఉన్నాను. ఏం జరుగుతుందో.. ఏం చేస్తారో ఇక ముందు నేను చూసుకొంటాను అని కంగన రనౌత్ మాటల దాడిని పెంచారు.

 సుశాంత్ ఎమోషనల్.. అందుకే ఆయన

సుశాంత్ ఎమోషనల్.. అందుకే ఆయన

ఇప్పటి నాపై ఆరు కేసులు పెట్టారు. నన్ను ఇంకా జైలులో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను మొండిగా వారిని ఎదుర్కొంటున్నాను. ఎవర్నీ లెక్క చేయకుండా నా ఫీలింగ్స్ ముఖం మీదే చెప్పేస్తాను. కానీ సుశాంత్ ఎమోషనల్‌, సున్నిత మనస్కుడు. పాపం అందుకే ఇలాంటి దాడులను భరించలేకపోయాడు. ఆదిత్య చోప్రా మాదిరిగానే ఎవరో నీ కెరీర్ నాశనం చేస్తారని బెదిరించి ఉంటారు. అందుకే ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఉంటాడు అని కంగన చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X