నీ చాప్టర్ క్లోజ్, నీకు సూసైడ్ గతే: కంగనకు అఖ్తర్ వార్నింగ్, ఆ హీరోయిన్ సూసైడ్‌తో సుశాంత్ మృతిని!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ మరోసారి హిందీ సినిమా ప్రముఖులపై తాజా ఇంటర్వ్యూలో మరోసారి భగ్గుమన్నారు. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, రచయిత జావెద్ అఖ్తర్, హృతిక్ రోషన్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. తనను ఎలా ఎదిరించారు? జైలుకు పంపిస్తామని హెచ్చరించారో పూసగుచ్చినట్టు కంగన సంచలన విషయాలు బయటపెట్టారు. కంగన చెప్పిన షాకింగ్ విషయాలు ఏమిటంటే..
Recommended Video

సుశాంత్ మరణం తర్వాత నోటికి వచ్చినట్టు
సుశాంత్ సింగ్ మరణం తర్వాత సినీ ప్రముఖులు తమ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చనిపోయిన వాడిని వదలకుండా అబద్దాలు పలుకుతున్నారు. సుశాంత్ మరణం, పర్వీన్ బాబీ మరణం ఒకేలా ఉందని మహేష్ భట్ పోల్చడంపై కంగన మండిపడ్డారు. బంధుప్రీతి అంశంతో బాలీవుడ్‌ను కొందరు రెండుగా విభజించి యువ నటుల జీవితాలతో ఆడుకొంటున్నారు అని కంగన చెప్పారు.

నా జీవితాన్ని నాశనం చేసేందుకు
నా జీవితంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను కొందరు సృష్టించారు. తన కెరీర్ ఆరంభంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. హృతిక్‌తో వివాదం నెలకొని ఉన్నప్పుడు నన్ను జావెద్ అఖ్తర్ లాంటి వాళ్లు ఎలా వేధించారనే విషయాన్ని బహిరంగ పరిచారు. ఒకరోజు జావెద్ అఖ్తర్ తన ఇంటికి పిలిచి బెదిరించిన విషయాన్ని కంగన బయటపెట్టారు.

నిన్ను జైలుకు పంపిస్తాం..
హృతిక్‌తో నాకు గొడవ జరుగుతున్నప్పుడు జావెద్ అఖ్తర్ తన ఇంటికి పిలిస్తే వెళ్లాను. రాకేష్ రోషన్ కుటుంబంతో పెట్టుకోకు అని నాతో అన్నారు. వాళ్లతో గొడవ పెట్టుకొని ఎక్కడికి వెళ్లలేవు. వాళ్లు నిన్ను జైలుకు పంపించడం ఖాయం. నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. చివరకు ఆత్మహత్య చేసుకోవడమే నీకు శరణ్యం అంటూ జావెద్ అఖ్తర్ బెదిరింపులకు పాల్పడ్డారని కంగన చెప్పారు.

ఇల్లు అదిరిపోయేటట్టు నాపై అఖ్తర్ అరిచి
జావెద్ అఖ్తర్ చెప్పిన విషయాలపై నేను అంతే ధీటుగా స్పందించాను. హృతిక్ కుటుంబానికి క్షమాపణలు చెప్పకపోతే నా కెరీర్ ముగిసినట్టే అని ఎందుకు అనుకొంటున్నావు? హృతిక్ క్షమాపణ చెప్పకపోతే నేను ఎందుకు సూసైడ్ చేసుకొంటానని భావిస్తున్నాం అని ప్రశించాను. అయితే నా ప్రశ్నలతో ఊగిపోతూ ఇళ్లంతా కంపించేలా నాపై అరిచారు అని కంగన తెలిపారు.

సుశాంత్‌ది సూసైడ్ కాదు.. మర్డర్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కంగన రనౌత్ చాలా ఎమోషనల్‌గా స్పందించారు. ఈ వీడియోను రిలీజ్ చేసి సుశాంత్‌ది ఆత్మహత్య కాదు. ఓ పథకం ప్రకారం చేసిన మర్డర్ అని ఆమె ఆరోపించారు. సుశాంత్‌ను ఒంటరి చేసినట్టే నాతో కూడా ప్రవర్తించారు. నాకు ఎదురైన సంఘటనలే సుశాంత్‌కు ఎదురై ఉంటాయి. ఆయన తట్టుకోలేకనే తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











